సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న చిత్రం నారప్ప.. విభిన్నపాత్రలు చేయడంలో మొదటి నుంచీ ముందుండే జాతీయ ఉత్తమనటి ప్రియమణి మొదటిసారి విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్నారు. నారప్ప చిత్రంలో ప్రియమణి సుందరమ్మగా చాలా రోజుల తర్వాత తెలుగు వారికి గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఇలా మరెన్నో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ మరెన్నో […]
సారథి న్యూస్, వనపర్తి: ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద రైతులు, వలస కూలీలతో పాటు పారిశ్రామిక రంగానికి పునరుత్తేజం కల్పించేందుకు బ్యాంకర్లు నిర్దేశించిన గడువు కంటే ముందుగానే లోన్లు ఇవ్వాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీపై బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఔత్సాహిక ప్రోత్సాహం కింద చేయూత ఇవ్వాలని సూచించారు. బ్యాంకుల వారీగా ఉన్న […]
సారథి న్యూస్, వనపర్తి: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపాలిటీ సిబ్బందిని సన్మానించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వరావు పాల్గొన్నారు.
సారథి న్యూస్, అచ్చంపేట: అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పకార్యమని ప్రభుత్వ విప్ గువ్వల బాల్ రాజు అన్నారు. శుక్రవారం అచ్చంపేటలో స్వేరోస్ నెట్వర్క్ నిర్వహించిన బ్లడ్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా ఆపద సమయంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని సూచించారు. నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తులసిరాం, మహబూబ్ నగర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజు, నాగర్ కర్నూల్ రెడ్ క్రాస్ కార్యదర్శి రమేష్ రెడ్డి, […]
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి వివిధ పథకాల కింద చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి 2016–19 సంవత్సరానికి మంజూరైన అభివృద్ధి పనులు, స్మార్ట్ సిటీ పనులు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. పట్టణంలో ప్రజల మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి […]
సారథి న్యూస్, రామగుండం: కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్లో ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులను పూర్తిచేస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతిలో భాగంగా 37, 46వ డివిజన్ లో పర్యటించారు. ఇంటిలో వాడిన నీటిని డ్రైనేజీల్లోకి వెళ్లేలా చూసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంతకుముందు రామగుండం కార్పొరేషన్ ఆఫీసు ఆవరణ, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే […]
సారథి న్యూస్, గోదావరిఖని: ప్రతిఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆర్జీ1 జీఎం కె.నారాయణ, రామగుండం ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కె.రామదాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్ జీ 1 జీఎం ఆఫీసులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పంచభూతాలను కలుషితం చేయొద్దన్నారు. సింగరేణి ఏరియాలో ఎక్కువ మొత్తంలో మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. జీవవైవిధ్యంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన ఉద్యోగులకు మెమొంటోలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు దామోదర్ రావు, అధికారుల సంఘం […]
సారథి న్యూస్, జనగామ: పేలుడు స్వభావం కలిగిన అమ్మోనియం నైట్రేట్ బస్తాలను జనగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సీఐ రాపెళ్లి సంతోష్ కుమార్ వివరాలు వెల్లడించారు. నర్మెట్ట మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన పున్నెరెడ్డి కృష్ణారెడ్డికి చెందిన వెంకటసాయి గోదాం నుంచి పేలుడు పదార్థాలకు వినియోగించే ముడి సరుకును రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో అమ్మాపురం, వెల్దండ, పోతారం చౌరస్తాలో ఎస్సై జక్కుల పరమేశ్వర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 50 […]