Breaking News

Day: June 3, 2020

‘ఖేల్​రత్న’కు జ్యోతి సురేఖ

న్యూఢిల్లీ: దశాబ్ద కాలంలో అనేక విజయాలు సాధించిన తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ.. రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డుకు నామినేట్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో 33 పతకాలు నెగ్గిన సురేఖకు ఏపీ ప్రభుత్వం కూడా మద్దతుగా నిలిచింది. బ్యాడ్మింటన్​లో షట్లర్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, సమీర్ వర్మ అర్జున బరిలో నిలిచారు. ద్రోణాచార్య కోసం ఎస్‌.మురళీధరన్‌, భాస్కర్‌ బాబు నామినేట్‌ అయ్యారు. ధ్యాన్‌చంద్‌ అవార్డు కోసం ప్రదీప్‌ గాంధీ, ముంజుషా కన్వర్‌ పేర్లను ఫెడరేషన్‌ రికమెండ్‌ […]

Read More

రిచర్డ్స్​కు జనాకర్షణ ఎక్కువ

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్​లో వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వీవీఎన్ రిచర్డ్స్​కు జనాకర్షణ ఎక్కువని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ స్మిత్ అన్నాడు. అతను ఆడుతుంటే… స్టేడియాలు హోరెత్తిపోతాయన్నాడు. అలాంటి విధ్వంసకర బ్యాట్స్​మెన్​ను ఐపీఎల్​లో ఆడించాలంటే కమిన్స్, స్టోక్స్ కంటే ఎక్కువే చెల్లించాల్సి వచ్చేదని స్మిత్ వ్యాఖ్యానించాడు. రిచర్డ్స్ ఆడే సమయంలో ఐపీఎల్ లేదు కాబట్టి ఫ్రాంచైజీలు బతికిపోయాయన్నాడు. ‘ఏ దశాబ్దంలోనైనా, ఏ ఫార్మాట్లోనైనా రిచర్డ్స్​కు తిరుగులేదు. అప్పట్లోనే అతని స్ట్రయిక్ రేట్ 67, 68గా ఉంది. అలాంటి […]

Read More

కోహ్లీని చూస్తే సిగ్గేసింది

న్యూఢిల్లీ: ఫిట్​నెస్​ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చూసి సిగ్గుపడ్డామని బంగ్లాదేశ్ బ్యాట్స్​మెన్​ తమీమ్ ఇక్బాల్ అన్నాడు. భారత క్రికెట్​లో వస్తున్న మార్పులను తాము అనుసరిస్తామన్నాడు. ఫిట్​ నెస్​ విషయంలో కోహ్లీసేన తమ దృక్పథాన్ని మార్చేసిందన్నాడు. ‘పొరుగు దేశమైన భారత్​లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి మాకూ ఉంటుంది. ప్రారంభంలో ఫిట్‌నెస్‌పై మాకు పెద్దగా అవగాహన లేదు. కానీ భారత్​ను చూశాకా మా దృక్పథం మొత్తం మారిపోయింది. ఇప్పుడు మేం కూడా ఫిట్‌నెస్‌ విషయంలో చాలా […]

Read More

నేనైతే రివర్స్ స్వింగ్ వేస్తా..

కలకత్తా: బంతిపై ఉమ్మిని రుద్దకుండా నిషేధం విధించినా.. తాను మాత్రం రివర్స్ స్వింగ్ రాబడతానని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. కాకపోతే బంతి రంగు మారకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించాడు. ‘ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చిన్నతనం నుంచి పేసర్లు బంతిపై ఉమ్మి రుద్దేందుకు అలవాటుపడ్డారు. ఇది ఆటలో భాగమైపోయింది. ఒకవేళ నీవు ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే బంతి రంగు మెరుగపర్చేందుకు ఉమ్మిని రుద్దాల్సిందే. అయితే ఆ బంతి రంగు పోకుండా కాపాడగలిగితే కచ్చితంగా రివర్స్ […]

Read More

తెలంగాణ ఫలాలు అందుతున్నాయ్​

సారథి న్యూస్​, హుస్నాబాద్​: తెలంగాణ స్వరాష్ట్ర ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయని వివరించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులను స్మరిస్తూ.. కాళేశ్వరం గోదావరి జలాలతో నివాళులు అర్పించారు. సమీకృత కలెక్టరేట్​ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసి మాట్లాడారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న […]

Read More