న్యూఢిల్లీ: ఓవైపు కరోనా భయపెడుతున్నా.. మరోవైపు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక క్రికెటర్లు ట్రైనింగ్ మొదలుపెట్టారు. కానీ టీమిండియా మాత్రం ఈ విషయంలో ఇంకా వెనకడుగు వేస్తూనే ఉంది. మరి భారత క్రికెటర్లు ట్రైనింగ్ ఎప్పుడు మొదలుపెడతారన్న దానిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ కొద్దిగా స్పష్టత ఇచ్చాడు. క్రికెటర్ల ప్రాక్టీస్‌కు సంబంధించి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), క్రికెట్ ఆపరేషన్స్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నాడు. ‘ఇప్పుడు మా ముందున్న లక్ష్యం.. క్రికెట్‌ను మొదలుపెట్టడం. ఇందుకు […]
న్యూఢిల్లీ: బ్యాటింగ్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆట కోసం క్లాస్‌లకు డుమ్మా కొట్టే వాళ్లమని సురేశ్ రైనా అన్నాడు. భారత మ్యాచ్‌ల కోసం వారంరోజుల నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకునే వాళ్లమన్నాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు కుటుంబసభ్యులతో తిట్లు తిన్నామని చెప్పాడు. ఈ సందర్భంగా 1998లో షార్జాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ను చూసేందుకు తాము పడిన కష్టాలను గుర్తుచేసుకున్నాడు. ‘ఆ రోజు ఆసీస్‌తో మ్యాచ్‌తో గెలిస్తే ఫైనల్‌కు చేరుతాం. ఆ మ్యాచ్‌ను ఎలాగైనా చూడాలని నేను, […]
న్యూఢిల్లీ: ఆధునిక క్రికెట్ యుగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను మించిన వాళ్లు లేరని లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అన్నాడు. భారత క్రికెట్ జట్టు విజయాలలో ఈ ఇద్దరి పాత్ర వెలకట్టలేనిదన్నాడు. అందుకే సమకాలిన క్రికెట్ లో ఈ తరం వాళ్లదేనని స్పష్టం చేశాడు. ‘మేం ఆడే రోజుల్లో ద్రవిడ్, దాదా అద్భుతంగా ఆడేవాళ్లు. కేవలం క్రికెటింగ్ షాట్లతోనే పరుగులు సాధించేవారు. సాంకేతికంగా కూడా ఈ ఇద్దరు చాలా […]
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల కోసం ఇద్దరు బాక్సర్లను భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) ప్రకటించింది. ప్రపంచ చాంపియన్ షిప్ రజత విజేత అమిత్ పంగల్(52 కేజీ), వికాస్ క్రిషన్ (69 కేజీ)ను ఈ అత్యున్నత పురస్కారానికి నామినేట్ చేసింది. గతంలో అమిత్ పేరును మూడుసార్లు అర్జున అవార్డుకు సిఫారసు చేసినా సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. 2012లో డోపింగ్ కేసులో అమిత్ దోషిగా తేలడంతో అతన్ని పక్కనబెడుతూ వచ్చారు. మరి ఇప్పుడు కమిటీ […]
సిడ్నీ: టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే కచ్చితంగా ఐపీఎల్లో ఆడతానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. తమ ప్రభుత్వం అనుమతిస్తే.. భారత్‌కు ప్రయాణించేందుకు సిద్ధమేనన్నాడు. ఈ సీజన్లో స్మిత్ రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉంది. ‘ఏ క్రికెటరైనా దేశం తరఫున ప్రపంచకప్ ఆడడం గొప్ప విషయం. ఎందుకంటే పరిమిత ఓవర్లలో క్రికెట్లో ఇదే అతిపెద్ద ఈవెంట్. అందుకే ప్రతిఒక్కరూ ఆ టోర్నీలో ఆడాలని కోరుకుంటారు. ఇందుకు నేను కూడా అతీతం కాదు. ఒకవేళ […]
న్యూఢిల్లీ: అనుకోకుండా వచ్చిన కరోనా బ్రేక్ వల్ల తన కెరీర్‌ను మరో రెండేళ్లు పొడిగించుకునే అవకాశం వచ్చిందని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. పక్కటెముక గాయంతో జనవరిలో ఆటకు దూరమైన అండర్సన్.. ఈ విరామంలో పూర్తిగా కోలుకున్నాడు. దీంతో గతవారం నుంచి బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ‘మళ్లీ క్రికెట్ మొదలుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ప్రేక్షకులు లేకుండా కేవలం నెట్స్‌లోనే ప్రాక్టీస్ చేస్తున్నందుకు కొంత అసంతృప్తిగా ఉంది. ఈ రెండింటిలో కామన్‌గా ఉన్నది క్రికెట్ […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉట్టిగా, ఆషామాషీగా రాలేదని, వందలాది మంది అమరవీరుల ఆత్మార్పణంతో ఆవిర్భవించిందని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యోపన్యాసం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఓ దశలో కన్నీటి పర్యంతమయ్యారు. గద్గదస్వరంతో ప్రసంగం కొనసాగించారు. నాటి తెలంగాణ ఉద్యమ […]