సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని కొత్తకాలనీ, ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసుల ఎదుట వేస్తున్న సీసీరోడ్డు పనులను నర్సాపూర్ ఎమ్మెల్యే సి.మదన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో సీసీరోడ్లు వేసినట్లు తెలిపారు. త్వరలోనే నర్సాపూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా సాగునీరు తీసుకొస్తామన్నారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో కోటిలింగం, కాంట్రాక్టర్ రాజు, పంచాయతీ రాజ్ ఏఈ ప్రభాకర్, ఉపసర్పంచ్ […]
సారథి న్యూస్, హుస్నాబాద్: విప్లవ రచయితల సంఘం నేత ప్రముఖ న్యాయవాది వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా టౌన్ లోని అనభేరి, సింగిరెడ్డి భూపతిరెడ్డి అమరుల భవనంలో సోమవారం ఆయన విలేకరులతో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపడం సరికాదన్నారు. ప్రపంచ మహమ్మారి కరోనా […]
సారథి న్యూస్, హుస్నాబాద్: జానపద కళాకారుడు గడిపె యాదగిరి మరణం కళారంగానికి తీరనిలోటని తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు గడిపె మల్లేష్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ యాదగిరి చిన్నతనం నుంచి అక్షర ఉజ్వల, వరకట్నం, సారా నిషేధం, కుటుంబ నియంత్రణ, పర్యావరణం సామాజిక చైతన్య గీతాలతో పాటు ఉషోదయ కల్చరల్ అసోసియేషన్ లో నృత్యాలు, పాటలు పాడాడన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సాంస్కృతిక సారథిలో ఉద్యోగం వస్తుందని ఎన్నో కలలుగన్నాడన్నారు. నేటికీ ఉద్యోగం రాకపోవడంతో […]
సారథి న్యూస్, హుస్నాబాద్: పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఏసీపీ మహేందర్ పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం పలువురికి థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు చేశారు. పోలీసులు ప్రజలతో మాట్లాడేటప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని, గ్లౌస్లు, మాస్కులు కట్టుకోవాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే నాన్ కాంటాక్ట్ ఈ చలాన్ ద్వారా కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై దాస సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సారథి న్యూస్, మెదక్: పారిశుద్ధ్యం అందరి బాధ్యత అని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని సోమవారం మెదక్ మున్సిపాలిటీలో ప్రారంభించారు. మొదటిరోజు 1, 2, 3, 4 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పట్టణ పరిధిలోని ఔరంగాబాద్, అవుసులపల్లి, హౌసింగ్ బోర్డు కాలనీల్లో పనులను పరిశీలించారు. బహిరంగంగా చెత్త వేస్తే ఊరుకునే లేదని, ఫైన్ విధించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమం ప్రతిరోజూ నాలుగు వార్డుల […]
సారథి న్యూస్, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గా కనకరత్నం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన వేణుమోహన్ ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సిద్దిపేట జిల్లా పంచాయతీరాజ్ ఈఈగా పనిచేస్తున్న కనకరత్నంకు ఎస్ఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ చీఫ్ ఇంజనీర్(ఈఎన్సీ) ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు మెదక్ పట్టణంలోని పంచాయతీరాజ్ సర్కిల్ ఆఫీస్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కనకరత్నం గతంలో మెదక్ జిల్లాలో […]
సారథి న్యూస్, నర్సాపూర్: అమాయకుల ప్రాణాలు బలిగొన్న నాటుసారాను ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం హరిచంద్ పంచాయతీకి చెందిన కొందరు గిరిజనులు విక్రయిస్తున్నారని సమాచారం తెలుసుకున్న అసిస్టెంట్ సూపర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి ఆదేశాల మేరకు ఎక్సైజ్ సీఐ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 10లీటర్ల నాటుసారా, 100 కేజీల నానబెట్టిన బెల్లం, బెల్లం ఊటను పారబోశారు. నాటుసారాను అమ్మినట్లు తమ దృష్టికి తీసుకొస్తే కఠినచర్యలు తీసుకుంటామని మాట్లాడుతూ చెప్పారు. ఆయన […]
న్యూఢిల్లీ: కాలేయ కేన్సర్‌తో పోరాడుతున్న భారత స్టార్ బాక్సర్ డింకో సింగ్‌కు కరోనా వైరస్ సోకింది. ఢిల్లీలో కీమోథెరపీ చేయించుకుని మణిపూర్ తిరిగి వచ్చిన తర్వాత అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో పాజిటివ్‌గా తేలడంతో చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ బారినపడిన తొలి భారత క్రీడాకారుడు అతనే. ఆర్థిక ఇబ్బందుల్లో డింకోకు.. కీమో చేయించుకునేందుకు విజేందర్, ఇతర బాక్సర్లు సాయం అందించారు. దీంతో ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీకి వెళ్లి కీమో చేయించుకున్నారు. కొన్ని రోజుల […]