Breaking News

Month: May 2020

టెస్టుల్లోకి మళ్లీ వస్తా

న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరుగులేని బౌలర్‌‌గా ఎదిగిన టీమిండియా పేసర్‌‌ భువనేశ్వర్‌‌.. టెస్ట్​ల్లోకి పునరాగమనం చేస్తానని ధీమా వ్యక్తంచేశాడు. ప్రస్తుతం ఈ ఫార్మాట్​లో ఆడుతున్న వారంతా బాగా రాణిస్తున్నారని చెప్పాడు. దీంతో తన పునరాగమనం మరింత కష్టమవుతుందన్నాడు. అయినా కచ్చితంగా ప్రయత్నిస్తానని చెప్పాడు. ‘టెస్ట్​ల్లో ఆడాలని బలంగా కోరుకుంటున్నా. కానీ పునరాగమనం సులువు కాదని తెలుసు. అయినా ప్రయత్నించడంలో తప్పు లేదని నా అభిప్రాయం. ఇప్పుడున్న పేసర్ల చాలా బాగా ఆడుతున్నారు. వాళ్లను దాటి చోటు […]

Read More

కిరణ్‌జిత్‌ కౌర్‌పై వేటు

న్యూఢిల్లీ: భారత లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌‌ కిరణ్​​జిత్​ కౌర్‌‌పై నాలుగేళ్ల నిషేధం వేటుపడింది. డోప్‌ పరీక్షలో విఫలమైనందుకు ప్రపంచ అథ్లెటిక్స్‌ బాడీ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్‌ 15న కోల్‌కతాలో జరిగిన టాటా స్టీల్‌ 25 కి.మీ. రేస్‌ సందర్భంగా సేకరించిన కిరణ్‌జిత్‌ శాంపిల్స్‌లో నిషేధిత డ్రగ్‌ ఉన్నట్లు తేలింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఆమెపై ప్రొవిజనల్‌ సస్పెన్షన్‌ విధించారు. అదేనెల 17న సేకరించిన రెండో శాంపిల్‌ను … దోహాలోని వాడా ల్యాబ్‌లో […]

Read More

టీ20 ప్రపంచకప్ డౌటే!

వచ్చే ఏడాదికి సిద్ధమన్న సీఏ మెల్​బోర్న్​: ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగడం కష్టమే. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారులు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తే మెగా ఈవెంట్​ను వాయిదా వేయడం ఖాయమేనని స్పష్టమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్​ను నిర్వహించలేమని సీఏ సీఈవో కెవిన్ రాబర్ట్స్ సంకేతాలిచ్చాడు. కరోనా, ప్రయాణ నిషేధం వల్ల ఈ ఏడాది టోర్నీ జరగడం కష్టమేనని తేల్చేశాడు. ‘ఒకవేళ ధైర్యంగా ముందుకెళ్లినా.. టోర్నీ నిర్వహణలో చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. […]

Read More

జనవరిలో బ్యాడ్మింటన్ చాంపియన్ ​షిప్

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్​లో జరగాల్సిన బ్యాడ్మింటన్ ప్రపంచ జూనియర్ చాంపియన్​ షిప్​ ను రీషెడ్యూల్ చేశారు. దీంతో వచ్చే జనవరి 18 నుంచి 24వ తేదీ వరకు ఆక్లాండ్​లో నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) నిర్ణయం తీసుకుంది. అంతకంటే ముందు ప్రపంచ జూనియర్‌ మిక్స్డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించేందుకు షెడ్యూల్‌ రూపొందించారు. ‘టోర్నీని విజయవంతం చేసేందుకు మేం కొత్త షెడ్యూల్​ను […]

Read More

ధోనీ అందుకు ఒప్పుకోలేదు

లంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర న్యూఢిల్లీ: 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను అప్పటి లంక కెప్టెన్‌ కుమార సంగక్కర గుర్తుచేసుకున్నాడు. ముంబైలోని వాంఖడేలో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో రెండుసార్లు టాస్‌ వేయాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పటి టీమిండియా సారథి ధోనీ వల్లే ఇలా జరిగిందన్నాడు. ‘ఫైనల్‌ కోసం అభిమానులు పోటెత్తారు. జనంతో వాంఖడే నిండిపోయింది. శ్రీలంకలో మేం ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడూ చూడలేదు. మా వాళ్లకు చాలా కొత్తగా అనిపించింది. […]

Read More

ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్​లు

ఈసీబీ సన్నాహాలు లండన్‌: అంతర్జాతీయ క్రికెట్​ను వీలైనంత తర్వగా గాడిలో పెట్టాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లను నిర్వహించేందుకు కసరత్తుచేస్తోంది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. యూకే ప్రభుత్వం అనుమతి కోసం కూడా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఔట్​ డోర్ ట్రైనింగ్​ మొదలుపెట్టాలని మరో 37మంది క్రికెటర్లకు ఈసీబీ సూచించింది. ఇప్పటికే 18మంది బౌలర్లు గత వారం నుంచే గ్రౌండ్​తో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ […]

Read More

రోహిత్.. చాలా కూల్

టీమిండియా మాజీ బ్యాట్స్​మెన్​ వీవీఎస్ లక్ష్మణ్ న్యూఢిల్లీ: ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడమే.. ఐపీఎల్​లో కెప్టెన్​గా రోహిత్ శర్మ సక్సెస్​ అయ్యాడని టీమిండియా మాజీ బ్యాట్స్​మెన్​ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. బ్యాట్స్​మెన్​ స్థాయి నుంచి సారథిగా ఈ ముంబైకర్ ఎదిగిన తీరు చాలా అద్భుతంగా ఉందని కొనియాడాడు. ‘2008 రోహిత్ డెక్కన్ చార్జర్స్​కు ఆడాడు. అప్పుడు అతనో కుర్రాడు. భారత్ తరఫున టీ20 ప్రపంచకప్ మాత్రమే ఆడాడు. అరంగేట్రం ఐపీఎల్ లో డీసీ […]

Read More
చావులోనూ ఒక్కటిగానే..

చావులోనూ ఒక్కటిగానే..

సారథి న్యూస్, మెదక్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. చావులోనూ ఒక్కటిగానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా సంచనం రేకెత్తించింది. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి(29), కామారెడ్డి జిల్లా మల్లుపల్లికి చెందిన రుచిత(25) నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. విజయ్ కుమార్ అదే గ్రామంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రుచిత అమ్మానాన్నలు రూ.ఆరులక్షల విలువైన బంగారు […]

Read More