Breaking News

Month: May 2020

టెన్త్ స్టూడెంట్స్​ కు ఆన్​ లైన్​ శిక్షణ

టెన్త్ స్టూడెంట్స్​ కు ఆన్​ లైన్​ శిక్షణ

ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ సారథి న్యూస్​, అనంతపురం: టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​కు ఆన్​ లైన్​లో శిక్షణ ఇవ్వాలని ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అధికారులకు సూచించారు. శనివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. కరోనా నేపథ్యంలో మార్చి 16 నుంచి విద్యాసంస్థలను మూసేశామని, మే 3తో లాక్‌డౌన్‌ ముగియనుందని చెప్పారు. స్కూలు, కాలేజీలు, హాస్టళ్లను వచ్చే విద్యాసంవత్సరానికి సిద్ధం చేయాలని సూచించారు. ఐఐటీ, జేఈఈ వంటి పోటీపరీక్షలకు ప్రభుత్వం శిక్షణ తరగతులను […]

Read More
డీసీఎం, బొలెరో ఢీ.. డ్రైవర్ మృతి

డీసీఎం, బొలెరో ఢీ.. డ్రైవర్ మృతి

విజయవాడ హైవేపై ఘటన సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: డీసీఎం, బొలెరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపురం సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. విజయవాడ హైవే(ఎన్​హెచ్​ 65) పై మల్కాపురం వద్ద ఆగిన డీసీఎంను హైదరాబాద్ వైపు మామిడికాయల లోడ్​ తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో వాహనం డ్రైవర్ అజయ్​ కుమార్(20) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే […]

Read More
కరోనా బస్సు వచ్చేసింది

కరోనా బస్సు వచ్చేసింది

ఆవిష్కరించిన మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి రోజురోజుకు  తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు పెద్దసంఖ్యలో టెస్టింగ్ లు నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఓ మొబైల్ కరోనా వైరస్ టెస్టింగ్ బస్సును రూపొందించింది. ఈ బస్ ను మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేశ్ తోపే, ఎన్విరాన్ మెంట్ మినిస్టర్ ఆదిత్యఠాక్రే, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (బీఎంసీ) ప్రవీణ్ పర్దేశీ శనివారం ఆవిష్కరించారు. బస్సులోనే టెస్టింగ్స్ […]

Read More
వసతులు కల్పించండి

వసతులు కల్పించండి

బీజేపీ నేతల వినతి సారథి న్యూస్, నర్సాపూర్: సొసైటీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు తీర్చాలని మెదక్​ జిల్లా కౌడిపల్లి తహసీల్దార్ ఆఫీసులో శనివారం బీజేపీ జిల్లా నాయకుడు రాజేందర్, రాకేశ్ వినతిపత్రం అందజేశారు. టెంట్లు వేయాలని, తాగునీటి వసతి కల్పించాలని కోరారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. రాజేందర్, రాకేష్ ,రాజు పాల్గొన్నారు

Read More
క్షౌరశాలలకు అనుమతి

క్షౌరశాలలకు అనుమతి

సారథి న్యూస్, అనంతపురం: లాక్‌డౌన్‌ మూడో దశలో మరిన్ని కార్యకలాపాల నిర్వహణకు కేంద్ర హోంశాఖ అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా రెడ్‌ జోన్లు మినహాయించి గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు తెరుచుకోవచ్చని శనివారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Read More
జర్నలిస్టులకు సరుకులు పంపిణీ

జర్నలిస్టులకు సరుకులు పంపిణీ

సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా నేపథ్యంలో జర్నలిస్టులు, పోలీసులు చేస్తున్న కృషి అమోఘమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి కొనియాడారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్​ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆదేశానుసారం శనివారం మెదక్​ జిల్లా కొల్చారంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పోలీస్​ స్టేషన్ లో ఎస్సై సార శ్రీనివాస్ గౌడ్ ను శాలువాతో సన్మానించి సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్​లు అందజేశారు.

Read More
దివ్యాంగులకు సరుకులు పంపిణీ

దివ్యాంగులకు సరుకులు పంపిణీ

        తెలంగాణ జాగృతి, దివ్యాంగులు సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ సమయంలో హయత్​ నగర్, మన్సురాబాద్ డివిజన్ల పరిధిలో 60 మంది దివ్యాంగులకు తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి నల్లగొండ శ్రీనివాసులు, వనస్థలిపురం డివిజన్ జాగృతి అధ్యక్షులు చింతల రవి బియ్యం, నిత్యావసర సరుకులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు దివ్యాంగులకు సేవా […]

Read More

పేదలకు చేయూత భేష్​

నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా సమయంలో పేదలను ఆదుకోవడం అభినందనీయమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ సీఎస్ఐ చర్చి కమిటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి హాజరయ్యారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Read More