సారథి న్యూస్, గోదావరిఖని: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ జన్మదినం పురస్కరించుకుని తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మంథని ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ప్రారంభించారు. అంతకుముందు ఎన్టీపీసీ మిలీనియం హాల్లో నూతన వ్యవసాయ విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి నారాయణ, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ […]
సారథి న్యూస్, ఆదిలాబాద్: ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు హెచ్ఎంలు, టీచర్లకు ఆన్ లైన్ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ డీఈవో ఏ.రవీందర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ సంస్థలు సంయుక్తంగా కోవిడ్ –19 మానసిక సంసిద్ధతపై క్లాసెస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని స్కూళ్ల నుంచి టీచర్లు హాజరుకావాలని సూచించారు. ఈనెల 17వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
సారథి న్యూస్, ఆదిలాబాద్: బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఓ వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించారు. మహారాష్ట్రలోని పుసద్ కు చెందిన కళావతి శేశరావ్ ఢగే(65) ఆదిలాబాద్‌లోని ఓ జిన్నింగ్ మిల్లులో పనిచేస్తోంది. ఆమె మృతిచెందడంతో మానవతా హృదయంతో అంత్యక్రియలు నిర్వహించినట్లు సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తెలిపారు.
చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి సారథి న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కార్యకలాపాలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగేందుకు నూడా పరిధిని నార్త్, సౌత్ జోన్ గా విభజించాలని నిర్ణయించినట్లు చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శనివారం నూడా ఆఫీసులో వైస్ చైర్మన్ జితేష్ వి.పాటిల్, సీపీవో జలంధర్ రెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ లేఅవుట్లను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే బోర్డు […]
– టీజర్ విడుదల చేసిన ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ రెండేళ్ల క్రితం తీసిన ‘జీఎస్టీ’ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) అనే షార్ట్ ఫిల్మ్‌ఎంత పెద్ద కాంట్రవర్సీకి దారి తీసిందో అందరికీ తెలిసిందే.. ఆ షార్ట్ ఫిల్మ్ ను అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో తీసి ఎన్ని విమర్శలొచ్చినా తాను అనుకున్నది సాధించి ఆ డాక్యుమెంటరీని రిలీజ్ చేశాడు ఆర్జీవీ. మియా మాల్కోవా అందానికి తలమునకలైపోయిన వర్మ ఆమెను తెగ పొగిడేయడమే కాదు […]
సారథి న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్ కు చెందిన న్యాయవాది కొర్రి గంగాధర్ యాదవ్ ఈనెల 7 నుంచి కనిపించడం లేదు. మరుసటి రోజు బిర్కుర్ లోని తన తల్లి వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని 3 టౌన్ ఎస్సై సంతోష్ కుమార్ శనివారం తెలిపారు.
– మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సారథి న్యూస్, మహబూబ్ నగర్: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత తొందరలోనే పూర్తిచేస్తామని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రూ.30 కోట్ల వ్యయంతో రూర్బన్ స్కీమ్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. గండీడ్ మండలంలో స్టేడియం, ఆడిటోరియం, వ్యవసాయ సంబంధిత అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి […]
‘రాఖీ రాఖీ రాఖీ నా కావసాకీ’ అంటూ ఎన్టీఆర్ సినిమాలో తన గొంతు వినిపించిన మమతా మోహన్ దాస్ మలయాళ కుట్టీ మీకు గుర్తుందా? చింతకాయల రవి, యమదొంగ సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలే చేసింది. అద్భుతమైన నటనను ప్రదర్శించే ఈ అమ్మడు అంతకంటే అద్భుతంగా పాడుతుంది. కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉండగానే ప్రజీత్ ను పెళ్లాడింది. తర్వాత కేన్సర్ మహమ్మారి చుట్టేసింది మమతను. ట్రీట్మెంట్ అంటూ చాలాకాలం గ్యాప్ తీసుకుంది. కేన్సర్‌ను జయించి గతేడాది ‘అనియాంకుజమ్ […]