Breaking News

Month: May 2020

భాగ్యరెడ్డివర్మ.. దళిత హక్కుల సూరీడు

ప్రజావాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ సారథి న్యూస్​, వనపర్తి: భాగ్యరెడ్డి వర్మ.. తెలంగాణ వైతాళికుడని, దళిత చైతన్య ప్రతీక అని, బాల్యవివాహాలు, అంటరానితనం వంటి దురాచారాలపై ఉద్యమించిన మహనీయుడని ప్రజావాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ కొనియాడారు. 132వ జయంతిని శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కళాకారుడు నందిమల్ల డప్పు నాగరాజు నివాసంలో నిర్వహించారు. ముఖ్య​అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమానికి దారి చూపారని కొనియాడారు. హక్కుల కోసం పోరాటాలు చేశారని గుర్తుచేశారు. అనే స్కూళ్లను ప్రారంభించి […]

Read More

శభాష్​ పోలీస్​

సారథి న్యూస్​, గోదావరిఖని: పొలాల్లో గడ్డికి మంటలు అంటుకోవడంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్సై రాజేష్ కానిస్టేబుల్​ తిరుపతితో కలిసి చాకచక్యంతో ఆర్పివేశారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో సుల్తానాబాద్ మున్సిపల్​ పట్టణ శివారులోని పెద్ద కెనాల్ పరిసర పొలాల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి సుమారు కి.మీ.మేర వ్యాపించాయి. రోడ్డుపై అటుగా వెళ్తున్న ఎస్సై, కానిస్టేబుల్​, స్థానికుల సహాయంతో గంటపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. సమీపంలో కోళ్లఫారాలు ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

Read More

పరిహారమిచ్చి ప్రాజెక్టు పూర్తిచేయండి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సారథి న్యూస్, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించి ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్​లో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాల్వ మంజూరై 27 ఏళ్లు గడుస్తున్నా నేటికీ పనులు పూర్తి కాలేదన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును 1.7 నుంచి 8.23 టీఎంసీల […]

Read More

కార్మికచట్టాలను కాలరాయొద్దు

కార్మిక సంఘాల జేఏసీ నేతలు సారథి న్యూస్​, పెద్దపెల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు, చట్టాలను కాలరాస్తున్నాయని నిరసిస్తూ.. ఏఐటీయూసీ, సీఐటీయూ ఐఎఫ్​ టీయూ తదితర కార్మిక సంఘాల జేఏసీ దేశవ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి కలెక్టరేట్​ ఎదుట ఆందోళన నిర్వహించారు. కేంద్రప్రభుత్వం కార్మికుల చట్టాలను రద్దు చేయడం సరికాదన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోతారని, పనికి, ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ […]

Read More

జూన్​ 8 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​

పదోతరగతి పరీక్షల షెడ్యూల్​ విడుదల చేసిన ప్రభుత్వం సారథి న్యూస్​, హైదరాబాద్​: హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, కోవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్​ 8వ తేదీ నుంచి జులై 5 వరకు పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు పరీక్ష నిర్వహించాలని.. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఇస్తూ షెడ్యూల్​ విడుదల చేసింది. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే విద్యార్థులను ఎగ్జామ్స్​కు అనుమతించనున్నారు. ఆదివారం కూడా […]

Read More

బావిలో 9 డెడ్​ బాడీస్​

నిన్న నాలుగు.. నేడు ఐదు పాడుబడ్డ బావిలో మృతదేహాలు వరంగల్​ రూరల్​ జిల్లాలో ఘటన సారథి న్యూస్​, వరంగల్: వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండ శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో పాడుబడ్డ బావిలో గోనె సంచిలో ఉన్న 9 మృతదేహాలు బయటపడ్డాయి. తాజాగా శుక్రవారం ఐదు డెడ్​ బాడీస్​ బయటపడగా, గురువారం నాలుగు డెడ్​ బాడీస్​ వెలుగుచూశాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు […]

Read More

రోకా సందడి

రానా ఆరోగ్యం బాగా లేదంటూ ఆ మధ్య సోషల్ మీడియా, న్యూస్ పేపర్లలో ఎన్నో వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ రీసెంట్​ రానా సినిమాల గురించి అప్​ డేట్స్​ వచ్చాయి. అయితే ఇప్పుడు రానా పెళ్లి వార్త అంతకంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోంది. ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఇదే న్యూస్ వినిపిస్తోంది. అభిమానులైతే పండుగ చేసుకుంటున్నారు. రానా మిహికాల నిశ్చితార్థం పెద్దల సమక్షంలో నిర్వహించిన రోకా ఫంక్షన్ సందడి బాగా జరిగింది. రానా కుటుంబంలో […]

Read More

ఇదీ పూజా ప్రాజెక్ట్​

గద్దల కొండ గణేష్ చిత్రంలో వెల్లువొచ్చి గోదారమ్మ.. పాటలో, శ్రీదేవి పాత్రలో మస్త్ కిక్కిచ్చిన భామ పూజాహెగ్డే టాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​ల లిస్ట్ లో ఒరు. ఆ తర్వాత పూజ అలవైకుంఠ పురములో ‘నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు..’ పాటతో మరింత కిర్రెక్కించింది. ప్రస్తుతం‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ప్రభాస్ తో తీస్తున్న సినిమాలో ప్రభాస్​ కు జోడీగా నటిస్తోంది. అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో కూడా కమిటైంది ఈ పొడుగుకాళ్ల […]

Read More