Breaking News

Month: May 2020

చెప్పిన పంటలు వేయమనడం సరికాదు

సారథి న్యూస్, రామడుగు: రైతులు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధరతోపాటు అదనంగా బోనస్ కల్పించాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. రైతుబంధును ఏ విధమైన షరతులు లేకుండా అమలు చేయాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. రైతులు ప్రభుత్వం చెప్పిన పంటలను వేయాలనడం హాస్యాస్పదమన్నారు. కార్యక్రమంలో నాయకులు జెట్టవేని అంజి బాబు, బోయిని వెంకటేశం, మ్యాడారం సత్యనారాయణ, గాలిపల్లి రాజు పాల్గొన్నారు.

Read More

కూచిపూడిలో కరోనా.. హైరానా

క్వారంటైన్‌‌కు ఇద్దరి తరలింపు సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో కరోనా కలకలం చెలరేగింది. కూచిపూడి గ్రామస్తులతో బంధుత్వం కలిగిన ఓ వ్యక్తి హైదరాబాద్‌‌లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఆయన ఇటీవల అనారోగ్యానికి గురికాగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్‌‌ వెళ్లి ఆయనను పరామర్శించి వచ్చారు. అయితే ఆ ఎస్సైకి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌‌ రావడంతో ఆయనను కలిసిన వారిపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో […]

Read More

మరో ముగ్గురికి కరోనా పాజిటివ్

సారథి న్యూస్, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని సిర్గాపూర్ మండలంలోని గరిడేగావ్ గ్రామాల్లో గత రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి కరోనా వైరస్ రిపోర్ట్ పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. మరో ముగ్గురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో జనం భయంతో వణికిపోతున్నారు. హైదరాబాద్ నుంచి ఈ నెల 10న వచ్చిన ఆయన ఖేడ్ లోని పలు గ్రామాల్లో తిరిగి బంధువులను కలిసినట్లు గుర్తించారు. వారిలో దాదాపు 30మంది […]

Read More

‘రిమ్స్’లో కార్మికుల నిరసన

సారథి న్యూస్, ఆదిలాబాద్ : సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక విధానాలపై శుక్రవారం రిమ్స్ ఆవరణలో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జాదవ్ రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పు, 12 గంటల పని దినాన్ని పెంచుతుందన్నారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్మికులందరికీ బోనస్ రూపంలో రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ […]

Read More

సరుకులు పంపిణీ

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​ : మహబూబ్ నగర్ రూరల్ మండలం కోటకదిర గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లు రమ్య దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రేషన్ కార్డు లేని వారికి బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతుబంధు అధ్యక్షుడు మల్లు దేవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మునీర్, మండల కో ఆప్షన్ ఎం.డి మస్తాన్, మాజీ ఎంపిటిసి నరసింహులు, పంచాయతీ సెక్రటరీ మాధవి, టిఆర్ఎస్ కార్యకర్తలు రాములు, శేఖర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Read More

జూన్​ లో షూటింగ్​ లకు ఓకే

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. లాక్​ డౌన్​ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. సినీరంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస్​ యాదవ్, […]

Read More

ముస్లింల అభ్యున్నతికి కృషి

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ​సారథి న్యూస్​, గోదావరిఖని: రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రంజాన్​ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో విజయమ్మ ఫౌండేషన్​, గ్లోబల్ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు నిత్యవసర సరుకులు, బియ్యం ఇతర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్ […]

Read More

పర్స.. అడుగుజాడల్లో నడవాలి

సారథి న్యూస్​, గోదావరిఖని: పర్స సత్యనారాయణ.. విప్లవ ఉద్యమానికి నాంది పలికారని, కార్మికవర్గం ఆయన అడుగు జాడల్లో నడవాలని పెద్దపల్లి జిల్లా సీఐటీయూ ఎర్రవెల్లి ముత్యం రావు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పర్స సత్యనారాయణ ఐదో వర్ధంతి స్థానిక సీఐటీయూ ఆఫీసులో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మిక ప్రాంతంలో పరస సత్యనారాయణ చేసిన కార్మిక ఉద్యమాల వలన ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవని […]

Read More