Breaking News

Month: May 2020

ధోనీలో ఆ కసి లేదు

న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లాండ్​తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్​లో భారత్ జట్టు గందరగోళంగా ఆడిందని ఆల్​ రౌండర్​ బెన్ స్టోక్స్ అన్నాడు. లక్ష్యఛేదనలో సూపర్ ఫినిషర్ ధోనీలో కసి కనిపించలేదన్నాడు. ఈ మ్యాచ్​లో ఇంగ్లండ్ 337/7 స్కోరు చేస్తే.. భారత్ 31 పరుగుల తేడాతో ఓడింది. ‘ఈ మ్యాచ్​ మొత్తంలో ధోనీ, జాదవ్ బ్యాటింగ్ వింతగా అనిపించింది. ఈ ఇద్దరిలో ఏమాత్రం కసి కనిపించలేదు. భారీ సిక్సర్ల కొట్టాల్సిన సమయంలో సింగిల్స్ తీయడంపై దృష్టిపెట్టారు. 11 ఓవర్లలో 112 […]

Read More

అలా.. ఆట ఎలా సాధ్యం

టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడకుండా.. జీవ రక్షణ వాతావరణంలో (బయో సెక్యూర్ ఎన్విరాన్​మెంట్​) క్రికెట్​ మ్యాచ్​లు నిర్వహించడం అసాధ్యమని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఇందంతా ఓ మిథ్య అని కొట్టిపడేశాడు. ఆట రెండవ రోజు ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే ఏం చేస్తారని ప్రశ్నించాడు. పాకిస్థాన్, వెస్టిండిస్​ తో జరిగే సిరీస్​లను బయోసెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తామని ఈసీబీ ప్రకటించిన నేపథ్యంలో ద్రవిడ్ పైవిధంగా స్పందించాడు. […]

Read More

పింక్ బాల్​ టెస్ట్ కోసం వెయిటింగ్

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ న్యూఢిల్లీ: భారత్​తో జరిగే పింక్ బాల్ టెస్ట్ ( డే నైట్) కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అన్నాడు. ఈ మ్యాచ్​లో పైచేయి సాధించేందుకు తాము అన్ని రకాల అస్ర్తాలను ప్రయోగిస్తామన్నాడు. ఈ ఏడాది చివరిలో ఆసిస్​లో పర్యటించే టీమిండియా.. నాలుగు టెస్ట్​ల సిరీస్ ఆడనుంది. ఇందులో ఒకటి డే నైట్ మ్యాచ్ ఆడతామని గతంలోనే గంగూలీ హామీ ఇచ్చాడు. ‘భారత్​తో సిరీస్​లో పింక్ బాల్ మ్యాచ్ […]

Read More

హెరాయిన్​తో పట్టుబడి..

కొలంబో: హెరాయిన్​తో పోలీసులకు పట్టుబడిన శ్రీలంక పేసర్ షెహన్ మదుషనకపై ఆ దేశ బోర్డు కొరడా ఝుళిపించింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పిస్తూ సస్పెన్షన్ వేటువేసింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ‘ఓ అపరిచిత వ్యక్తితో కలిసి మదుషనక హెరాయిన్ తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అతనిపై మేం చర్యలు తీసుకున్నాం. ఏ ఫార్మాట్లోనూ ఆడకుండా సస్పెండ్ చేశాం. అంతర్గత విచారణ పెండింగ్​లో ఉంది. దోషిగా తేలితే మరిన్ని […]

Read More

ప్రియురాలితో రెడ్​ హ్యాండెడ్​గా దొరికిన భర్త

సారథి న్యూస్​, వరంగల్​: వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను ప్రియురాలి ఇంట్లో భార్య పట్టుకుని చితకబాదింది. ఈ ఘటన వరంగల్ సిటీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వరంగల్ అర్బన్ జిల్లా పోతన్​ నగర్ లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు తులసి, శ్రీనివాస్ కు పదేళ్ల క్రితం వివాహమైంది. తులసి ప్రభుత్వ ఉద్యోగిని. తరుచూ ఇద్దరూ గొడవపడేవారు. భార్య సంపాదనతోనే కుటుంబం గడుస్తోంది. అయితే రెండు నెలలైనా భర్త ఇంటికి రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. […]

Read More

ఎస్సైకి ఘనసన్మానం

సారథి న్యూస్​, హయత్​నగర్​(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఎస్సైగా పనిచేసి.. ట్రాన్స్​ఫర్​పై వెళ్తున్న సైదారెడ్డిని స్థానిక వార్డుసభ్యుడు మొగుళ్ల జీవన్ రెడ్డి, టీఆర్​ఎస్​ నాయకుడు మొగుళ్ల వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. మూడేళ్లపాటు ఇక్కడ శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో విశేషసేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో ఎం.నరేష్ గౌడ్, ఎండీ ఇమ్ము, వినీత్ గౌడ్, అఖిల్ రెడ్డి, సందీప్, అజయ్, సాధిక్, మహేష్ పాల్గొన్నారు.

Read More

ఎల్జీ పాలీమర్స్​ అక్కడ ఉండొద్దు

బాధితులను ఆదుకుంటాం మాజీ సీఎం చంద్రబాబు సారథి న్యూస్​, అమరావతి: గ్రామాల మధ్య ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఉండడానికి వీల్లేదని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన మహానాడులో తీర్మానం చేశారు. టీడీపీ మహానాడు బుధవారం మంగళగిరిలోని సెంట్రల్​ ఆఫీసులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎల్జీ కంపెనీని కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం సీజ్ చేశారన్నారు. […]

Read More

ప్రకాష్ రాజ్ వైల్డ్ వాయిస్

ప్రముఖ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ టెలివిజన్ చానెల్ వారు మొదటిసారి కర్ణాటక రాష్ట్రంలోని వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ పై ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న 8 గంటలకు డిస్కవరీ చానెల్​లో ప్రసారమయ్యే ఈ డాక్యుమెంటరీకి ఇంగ్లిష్​లో డేవిడ్ అట్టెన్ బోరోగ్ వాయిస్ నిచ్చారు. మనదేశంలో ప్రముఖ భాషలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రసారమయ్యే ఈ డాక్యుమెంటరీకి ఇక్కడి హీరోలతోనే వాయిస్ చెప్పించారు. హీందీ అనువాదానికి రాజ్​ కుమార్ రావు, […]

Read More