Breaking News

Month: May 2020

ఆ 10 ప్రదేశాలు ఇండియాలోనే..

వెల్లడించిన ఎల్‌ డొరాడో వెబ్‌సైట్‌ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు అదరగొడుతున్నాయి. రెండు మూడు రోజులుగా అత్యధిక టెంపరేచర్లు నమోదవుతున్నాయి. కాగా 24 గంటల్లో అత్యధిక టెంపరేచర్లు నమోదైన 15 సిటీల్లో 10 మన దేశంలోనే ఉన్నాయని, పాకిస్తాన్‌లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ పర్యవేక్షణ వెబ్‌సైట్ ఎల్ డొరాడో తెలిపింది. వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం మంగళవారం రాజస్థాన్‌లోని చురులో 50 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. 2016 మే19న కూడా చురులో టెంపరేచర్‌‌ 50 డిగ్రీలు […]

Read More

ట్రంప్‌ ట్వీట్లకు ఫ్యాక్ట్‌ చెక్‌ వార్నింగ్‌

మొదటిసారి జారీ చేసిన ట్విట్టర్‌‌ వాషింగ్టన్‌: ఎన్నికల్లో మెయిల్‌ ఇన్ బ్యాలెట్‌ వాడడం వల్ల మోసం జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్లకు ట్విట్టర్‌‌ ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ వార్నింగ్‌ ఇచ్చింది. ఎలక్షన్స్‌కు సంబంధించి ఆయన చేసిన రెండు ట్వీట్లు నిజమో కాదో తెలుసుకోవాలని నెటిజన్లకు ట్విట్టర్‌‌ సూచించింది. ట్రంప్‌ ట్విట్లకు‘ఫ్యాక్ట్‌ చెక్‌’ వార్నింగ్‌ను ఇవ్వడం ఇదే మొదటిసారి. ట్విట్టర్‌‌ వాడకంలో ట్రంప్‌ తన పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని ఈ […]

Read More

ఇక్కడే ఆకలితో చచ్చిపోతావేమో..

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌ డౌన్‌ వలస కూలీల పొట్టకొడుతోంది. తినేందుకు తిండి లేక, పనులు లేక డబ్బుల్లేక వాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ కోసం ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లు ఏర్పాటు చేసినా.. అవి సమయానికి రావడంలేదని, ఆకలికి తట్టుకోలేక ఎండకు తట్టుకోలేక ఇక్కడే చచ్చిపోతామేమో అని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైళ్లలో సీటు ఎప్పుడు దొరుకుతుందా.. ? ఇంటికి ఎప్పుడు పోతామా అని రైల్వే […]

Read More

ఫ్లైట్‌లోని సెక్యూరిటీ స్టాఫ్‌కు కరోనా

ప్యాసింజర్లంతా హోం క్వారంటైన్‌ న్యూఢిల్లీ: ఢిల్లీ – లుథియానా ఎయిర్‌‌ అలియన్స్‌ (ఎయిర్‌‌ ఇండియా) ఫ్లైట్‌లో సోమవారం డ్యూటీ చేసిన సెక్యూరిటీ స్టాఫ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఫ్లైట్‌లోని ప్యాసింజర్లకు టెస్టులు చేయగా అందరికీ నెగటివ్‌ వచ్చింది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలించామని, ప్యాసింజర్లను హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఢిల్లీకి చెందిన సెక్యూరిటీ స్టాఫ్‌ ఎయిర్‌‌ఇండియా ఫ్లైట్‌లో సోమవారం డ్యూటీ చేశారని, ఫ్లైట్‌ దిగిన తర్వాత […]

Read More

ప్రధాని మోడీకి అంకితం

న్యూఢిల్లీ: ప్రముఖ వాయోలినిస్ట్‌ ఎల్‌. సుబ్రమణియన్‌ ‘వసుదైవ కుటుంబం’ అనే సింఫనీని ప్రధాని నరేంద్ర మోడీకి అంకితమిచ్చారు. ప్రముఖ పండితులు జైరాజ్‌, బిర్జూ మహరాజ్‌, ఏసుదాసు తదితరులతో కలిసి దాన్ని రూపొందించారు. ‘లండన్‌ సింఫనీ ఆర్కెస్ట్రా, లెజండరీ ఆర్టిస్టులు జాస్‌రాజ్‌, బిర్జూ మహరాజ్‌, బేగం పర్వీన్‌ సుల్తాన్‌, ఏసుదాసు, ఎస్పీబీ, కవితలతో కలిసి భారత సింఫనీ వసుదైవ కుటుంబం అనే సింఫనీని రిలీజ్‌ చేశాను. దాన్ని దేశానికి, మన ప్రధాని అంకితం ఇస్తున్నాను’ అని సుబ్రమణియన్‌ ట్వీట్‌ […]

Read More

అదిగో గోదారి..

కొండపోచమ్మ సాగర్ లోకి పంపింగ్ కు రెడీ 29న సీఎం కేసీఆర్​ చేతులమీదుగా ప్రారంభం ఇక మెతుకుసీమకు జలసిరి సారథి న్యూస్, మెదక్: రైతుల సాగు నీటికష్టాలు దూరం చేసి, లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చేసే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలితాలు రైతులకు అందే సమయం ఆసన్నమైంది. భారీ ప్రణాళికతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పరిధి జలాశయాలకు గోదావరి జలాలు చేరుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితమే సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో నిర్మించిన […]

Read More

మన పేసర్లకు తిరుగులేదు

బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ న్యూఢిల్లీ: టెస్టుల్లో టీమిండియాను నడిపిస్తున్న పేస్ బలగానికి మరో రెండేళ్లు తిరుగులేదని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. స్వదేశంతో పాటు విదేశంలోనూ వీళ్లకు ఎదురులేదన్నాడు. ‘గత రెండు సీజన్లలో ఇషాంత్(297 వికెట్లు), షమీ(180 వికెట్లు), ఉమేశ్ యాదవ్(144 వికెట్లు), బుమ్రా (68 వికెట్లు) అద్భుతంగా రాణిస్తున్నారు. రాబోయే రెండేళ్లు కూడా వీళ్లకు ఎదురులేదు. ఏ ఇబ్బంది లేకుండా సమష్టిగా రాణించడం వీళ్లకు ఉన్న బలం. ఫిట్​నెస్​ను కాపాడుకుంటే అదనంగా మరికొన్ని […]

Read More

ఎక్స్​ట్రా రివ్యూ.. అందుకోసమే

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే న్యూఢిల్లీ: స్థానిక అంపైర్లకు టెస్ట్ మ్యాచ్ అనుభవం లేకపోవడంతోనే అదనంగా మరో రివ్యూను ప్రతిపాదించామని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే వెల్లడించాడు. మ్యాచ్​లో ఎలాంటి తప్పులు జరగొద్దని, ఏ జట్టు నష్టపోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. ‘క్రికెట్​ను సురక్షితంగా, సజావుగా గాడిలో పెట్టడమే మన ముందున్న లక్ష్యం. మ్యాచ్​లో పారదర్శకత కోసం 20 ఏళ్ల నుంచి తటస్థ అంపైర్లను ఉపయోగిస్తున్నాం. కానీ ఇప్పుడు అంతర్జాతీయ ట్రావెల్ […]

Read More