Breaking News

Day: May 28, 2020

మావోయిస్టులకు నగదు

అటవీ అధికారి అరెస్టు సారథి న్యూస్​, కొత్తగూడెం: మావోయిస్టులకు నగదు తీసుకెళ్తున్నారనే కారణంతో గురువారం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.ఆరులక్షల వసూలు చేసి కారులో తీసుకెళ్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి వద్ద పోలీసుల తనిఖీచేసి పట్టుకున్నారు. నిందితుల్లో భద్రాచలం అటవీశాఖ బీట్ ఆఫీసర్ మరకం వీరేందర్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పాల్వంచకు చెందిన బండి వెంకటేశ్వర్లు, ఆలపాటి ప్రసాద్‌ ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.ఆరు […]

Read More

కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటు

సారథి న్యూస్​, గోదావరిఖని: విధుల్లో బాధ్యతారహితంగా వ్యవహరించారనే కారణంతో కానిస్టేబుల్​ సుధీర్​పై సస్పెన్షన్​ వేటు వేసినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Read More

బాలయ్య ఆవేశం.. నాగబాబు ఆగ్రహం

లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్​లో ఆగిపోయిన సినిమా షూటింగ్​లు ఎప్పుడు మొదలు పెట్టాలనే అశం గురించి సినిమారంగ ప్రముఖులతో తెలంగాణ సీఎం కేసీఆర్ మే 22న ప్రగతి భవన్ లో సమావేశమై మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ […]

Read More

ట్రాఫిక్​ సమస్యకు ఇక చెక్​

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. నాగార్జున సిమెంట్ సంస్థ వారు అందజేసిన బారికేడ్లను గురువారం ఆయన ప్రారంభించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్​ ఆర్డర్ మురళీధర్, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐలు చిట్టిబాబు, కరుణాకర్, శ్రీధర్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Read More

వస్తోంది.. మిడతల దండు

మన పంటలకూ కీటకాల ముప్పు ఏపీలోని అనకాపల్లిలో పంటలపై దాడి సారథి న్యూస్​, హైదరాబాద్​, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలకు మరో ఆపద పొంచి ఉంది.. గంటకు 15కి.మీ వేగంతో మిడతల దండు దూసుకొస్తోంది. పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి కదిలిన లక్షలాది మిడతలు పంటలపై దాడిచేసి దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంటలను తినేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో లక్షల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. తాజాగా అవి మహారాష్ట్రలోని అమరావతిలోకి కూడా ప్రవేశించాయి. అక్కడి […]

Read More

మూడేళ్లలో భావనపాడు పోర్టు పూర్తి

సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టును మూడేళ్లలో పూర్తిచేస్తామని సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రామయ్యపట్నం, మచిలీపట్నం పోర్టులను పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు కూడా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ‘మన పాలన.. మీ సూచన’ మేధోమదన సదస్సులో భాగంగా గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో సానుకూల ప్రభుత్వం ఉందని, పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా చూస్తామని, ఎవరూ […]

Read More

దివ్యాంగులను ఆదుకోవడమే ధ్యేయం

సారథి న్యూస్​, కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలో సుమారు ఐదొందల మంది దివ్యాంగులకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేంద్రరావు గురువారం పంపిణీ చేశారు. దివ్యాంగులను ఆదుకోవడమే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంఏ రజాక్​ తదితరులు పాల్గొన్నారు.

Read More

నాని, సాయిపల్లవి మరోసారి

ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో ‘వి’ విడుదలకు రెడీ కాగా, వరుస సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు నాని. శివ నిర్వాణతో ‘టక్ జగదీష్’, ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్​ సింగరాయ్’ సినిమాలో నటించనున్నాడు నాని. వీటితో పాటు వివేక్ ఆత్రేయతోనూ ఒక మూవీ కమిట్ అయ్యాడు. ఇంతలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. సితార ఎంటర్​ టైన్​మెంట్​ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ […]

Read More