వెటరన్ ప్లేయర్ సురేశ్ రైనా ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు పోటీ ఇవ్వగల జట్టు ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్స్. కెప్టెన్ రోహిత్ రాకతో మరింత బలంగా తయారైన ముంబై.. నాలుగుసార్లు టైటిల్స్‌ను కూడా కొల్లగొట్టింది. అయితే కెప్టెన్సీ విషయంలో కొన్నిసార్లు రోహిత్.. ధోనీని గుర్తుకు తెస్తాడని వెటరన్ ప్లేయర్ సురేశ్ రైనా అన్నాడు. కొన్ని లక్షణాలు అచ్చం మహీని పోలి ఉంటాయన్నాడు. ‘ప్రశాంతత, ఆటగాళ్లకు ప్రేరణ కల్పించడంలో ధోనీలాగా వ్యవహరిస్తాడు. కెప్టెన్సీ కూడా […]
ఆస్ర్టేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ సిడ్నీ: టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాను ఈసారి ఎలాగైనా ఔట్ చేయాల్సిందేనని ఆస్ర్టేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. అందుకోసం కొత్త మార్గాలు వెతుకుతున్నానని చెప్పాడు. గత సిరీస్ ప్రదర్శనను మరోసారి పునరావృతం చేయనివ్వబోనని స్పష్టం చేశాడు. ‘సాధ్యమైనంత వరకు పుజారా ఎక్కువసేపు క్రీజులో ఉండడానికి ప్రయత్నిస్తాడు. బ్యాటింగ్‌లో ఆందోళన చెందడు. ఈ ప్రత్యేకత వల్లే పరుగుల వరద పారిస్తున్నాడు. అందుకే మేం అతన్ని ఔట్ చేసేందుకు […]
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ న్యూఢిల్లీ: ఇంగ్లండ్ క్రికెట్ బాగా అభివృద్ధి చెందడానికి ఐపీఎల్ చాలా దోహదపడిందని ఆ దేశ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ అన్నాడు. ఐసీసీ ప్రపంచకప్‌ల తర్వాత ఐపీఎల్ బెస్ట్ టోర్నీ అని కితాబిచ్చాడు. ఈసారి లీగ్ జరిగితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘ఇంగ్లిష్ క్రికెట్ పురోగతి సాధించడానికి ఐపీఎల్ చాలా సాయం చేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కొన్నేళ్లుగా ఎంతో మంది క్రికెటర్లు ఇందులో ఆడుతున్నారు. వాళ్లంతా ఆటపరంగా, ఆర్థికంగా చాలా […]
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ముంబై: బౌలర్లు పూర్తి స్థాయిలో టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టాలంటే కనీసం రెండు నెలల ప్రాక్టీస్ అవసరమని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. గాయాల బారినపడకుండా ఉండాలంటే ఇది కచ్చితంగా అవసరమని చెప్పింది. ‘లాక్ డౌన్ కారణంగా బౌలర్లంతా ఇంటికే పరిమితమయ్యారు. కనీసం రన్నింగ్ ప్రాక్టీస్ కూడా లేదు. ఇప్పటికిప్పుడు టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టాలంటే వాళ్లకు పెద్ద రిస్క్ ఉంటుంది. గాయాల బారినపడతారు. అందుకే ముందు చిన్నచిన్న కసరత్తులు మొదలుపెట్టి పూర్తిస్థాయి రన్నింగ్ […]
తుంటి ఎముక కీలు శస్త్రచికిత్స మానవ శరీర భాగాల్లో ఎముకలు ఎంత పటిష్ఠంగా ఉంటే అంత సమర్థవంతంగా పని చేయగలుగుతారు. ముఖ్యంగా అన్ని ఎముకల్లోకి బలమైంది, అధిక బరువు మోయగలిగేది తొడ భాగాల్లో ఎముకలు(తుంటి ఎముకలు). ఇవి తుంటి భాగానికి అతుక్కుని ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, లేదా అధిక శ్రమతో కీళ్లు అరిగిపోయి ఎముకలో పట్టు తగ్గినా దాన్ని సర్జరీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, రొమిటో ఆర్థరైటిస్ బారినపడిన వాళ్లకు ఒక్కోసారి ఈ […]
వచ్చే వారం ఐసీసీ అధికారిక ప్రకటన న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఇప్పటికే పలు టోర్నీల రద్దుతో అస్తవ్యస్తమైన క్రీడా ప్రపంచానికి ఇప్పుడు మరో దెబ్బ పడనుంది. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ కూడా వైరస్ ఖాతాలో పడేలా కనిపిస్తోంది. అక్టోబర్, నవంబర్‌లో జరగాల్సిన ఈ టోర్నీని వాయిదావేసే దిశగా ఐసీసీ వేగంగా అడుగులు వేస్తోంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు జరిగే గవర్నింగ్ బాడీ సమావేశంలో దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఈవెంట్‌ను వాయిదా వేస్తే […]
11 రకాల క్రీడల్లో ఔట్ డోర్ ప్రాక్టీస్ న్యూఢిల్లీ: లాక్ డౌన్ తర్వాత వివిధ రకాల క్రీడల్లో ట్రెయినింగ్‌ను మొదలుపెట్టేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ వోపీ) పేరుతో మార్గదర్శకాలు విడుదల చేసింది. అథ్లెటిక్స్, హాకీ, బ్యాడ్మింటన్‌తో కలిసి 11 రకాల క్రీడల్లో ఔట్ డోర్ ట్రెయినింగ్‌కు అనుమతి ఇచ్చింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెయిట్ లిఫ్టర్లు, ఆర్చర్లు, సైక్లిస్ట్‌లు కూడా శిక్షణ తీసుకోవచ్చు. గతంలో మాదిరిగా కాకుండా టచ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు హరికిషన్ శనివారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. హరికిషన్ మే 30, 1963లో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో జన్మించారు. ఎనిమిదేళ్ల వయసులోనే మిమిక్రీ చేయడం మొదలు పెట్టిన హరికిషన్ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వేల ప్రదర్శనలు ఇచ్చారు. అగ్రనటుడు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌తో పాటు ఎంతో మంది సినీనటుల గొంతులను ఆయన అనుకరించేవారు. కేవలం సినిమాల్లో వారు […]