Breaking News

Day: May 24, 2020

14 రోజుల ఐసోలేషన్​ తప్పనిసరి

దుబాయ్​: కరోనా కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్​ను మొదలుపెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. ప్రతిజట్టు 14 రోజుల ప్రీ మ్యాచ్​ ఐసోలేషన్​ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే అన్ని జట్లు మెడికల్​ ఆఫీసర్​ను నియమించుకోవాలని ఆదేశించింది. మొత్తం నాలుగు దశల్లో క్రికెట్​ను పూర్తి స్థాయిలో మొదలుపెట్టనున్నారు. ‘క్రికెటర్లు ఫిట్​నెస్​ కోల్పోకుండా చిన్నచిన్న కసరత్తులతో ప్రాక్టీస్​ మొదలుపెట్టాలి. తర్వాత ఇద్దరు, ముగ్గురుగా గ్రూపు శిక్షణ చేసుకోవచ్చు. మూడో దశలో కోచ్​ పర్యవేక్షణలో పదిమంది కలిసి […]

Read More

మాలాంటి ఫీల్డర్లు లేరు

మాజీ స్టార్​ క్రికెటర్​ మహ్మద్ కైఫ్ న్యూఢిల్లీ: ఒకప్పుడు టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్లు యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్. అథ్లెటిక్ విన్యాసాలతో దాదాపు 20 నుంచి 30 పరుగులు ఆపేవారు. నమ్మశక్యం కానీ క్యాచ్​ లను అద్భుతహా అనే రీతిలో అందుకునేవారు. ఓ దశలో ప్రపంచ బెస్ట్ ఫీల్డర్ల సరసన చోటు కూడా సంపాదించారు. అయితే ఇప్పుడున్న టీమిండియాలో తమలాంటి ఫీల్డర్లు కరువయ్యారని కైఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తిస్థాయి ఫీల్డర్లు కనిపించడం లేదన్నాడు. ‘మన జట్టులో […]

Read More

నోరా.. ఔరా!

సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ఇన్​స్టాగ్రామ్ మోడల్, సింగర్, డ్యాన్సర్ అయిన నోరా ఫతేహి ‘టెంపర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్​ తో కలిసి ఇట్టాగే రెచ్చిపోదాం.. అంటూ ఆడి పాడి తెలుగువాళ్ల హృదయాలు కొల్లగొట్టింది. తర్వాత ‘కిక్ 2’, ‘షేర్’, ‘లోఫర్’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్​ లో ‘భుజ్ ది ప్రైడ్’లో సినిమా చేస్తోంది. సినిమా ఆఫర్లు అంతగా లేకపోయినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్​ను అలరిస్తూనే ఉంటుంది. అయితే […]

Read More

బస్సు సీటు మారింది

లాక్ డౌన్ ఎఫెక్ట్ సారథి న్యూస్​, గోదావరిఖని: లాక్ డౌన్ పాపమా! అని అని జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, దాదాపు 50రోజుల తర్వాత కొన్నిరాష్ట్రాల్లో బస్సులు రోడ్డెక్కుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమే బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అది కూడా నిబంధనలతో కూడిన అనుమతి మాత్రమే ఉంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో సాధారణంగా 36 నుంచి 40 సీట్లు మాత్రమే ఉంటాయి. కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో భౌతికదూరం పాటించాల్సి ఉంది. అందుకోసం ఆర్టీసీ […]

Read More

పోడు పంచాయితీ

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం వీకే రామవరంలో పోడు భూముల చుట్టూ శనివారం ఫారెస్ట్ అధికారులు ఫెన్సింగ్​ చుడుతుండగా రైతులు, అధికారుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఒకరు గాయపడ్డారు. ఈ భూములపై హక్కులు కల్పించాలని స్థానిక సీపీఎం నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

Read More

ఆఫీసుకు వస్తే మాస్క్​ ఉండాలె

సారథి న్యూస్​, కౌడిపల్లి: వివిధ అవసరాలకు ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్క్​ కట్టుకోవాలని మెదక్​ అడిషనల్​ కలెక్టర్​ నగేష్ సూచించారు. శనివారం కౌడిపల్లి తహసీల్దార్ ఆఫీసును సందర్శించారు.వెంకటాపూర్ ఆర్ గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సేకరించిన భూములను ఇరిగేషన్​ శాఖ పేర బదిలీచేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్​ రాణా ప్రతాప్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ తారాబాయి ఉన్నారు.

Read More

మే ఫుల్​ జీతం ఇవ్వండి

సారథి న్యూస్, ఆదిలాబాద్: మే నెల పూర్తిజీతం చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్​ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకట్​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్​ ఆఫీసు నల్లబ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. లాక్​ డౌన్​ పేరుతో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతం ఇవ్వడం సరికాదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనే ఉద్యోగుల వేతనాల్లో కోత అమలవుతోందని ఆక్షేపించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ రావు, జిల్లా […]

Read More

శార్దూల్.. ప్రాక్టీస్ షురూ

ముంబై: లాక్​ డౌన్​తో రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ ఎట్టకేలకు శనివారం స్థానిక బోయ్​ సర్​ మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే దీనికి బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నాడో లేదో తెలియదు. లాక్​ డౌన్​ తర్వాత ట్రైనింగ్​ మొదలుపెట్టిన భారత క్రికెటర్ శార్దూల్ కావడం విశేషం. లాక్​ డౌన్​ సడలింపుల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో స్టేడియాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.దీంతో శార్దూల్.. కొంతమంది దేశవాళీ క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ […]

Read More