మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సారథి న్యూస్, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని కూర్చొని పూర్తి చేయిస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తికాలేదని, సీఎం కేసీఆర్ ది నోరా మోరా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బుధవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న ముంపు గ్రామాల్లో కాంగ్రెస్ నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. […]
మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి సారథి న్యూస్, మెదక్: ఈతకు వెళ్లి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చకూడదని మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి హెచ్చరించారు. ఎండాకాలం సెలవుల కారణంగా పట్టణాలు, గ్రామాల్లో స్టూడెంట్స్, యువకులు పొలాలు, బావులు, చెరువుల వెంట కాలక్షేపం చేస్తున్నారని, ఈతకు మునిగి చనిపోయి కన్నవారికి శోకం మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈతకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పెద్దలను వెంట పెట్టుకుపోవాలని సూచించారు. ఈతకు వెళ్లే చిన్నారులపై పేరెంట్స్ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి వ్యక్తికి […]
మంత్రి హరీశ్‌రావు సారథి న్యూస్, మెదక్: తలసేమియా బాధితులు, గర్భిణుల కోసం టీఎన్జీవోల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు మేడిశెట్టి శ్యామ్ రావు, కార్యదర్శి దొంత నరేందర్ ఆధ్వర్యంలో బుధవారం మెదక్ టీఎన్జీవో భవన్ లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఏరియా హాస్పిటల్ పర్యవేక్షకుడు […]
-మంత్రి హరీశ్‌రావు సారథి న్యూస్, మెదక్: వృథానీటికి అడ్డుకట్ట వేయడం, భూగర్భ జలాల పెంపు, రైతుల సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రూ.1200 కోట్ల నాబార్డ్ నిధులతో రాష్టవ్యాప్తంగా ప్రభుత్వం చెక్ డ్యామ్ లు నిర్మిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. బుధవారం ఆయన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి హవేలిఘనపూర్ మండలం సర్ధన వద్ద మంజీరా నదిపై చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హవేలి ఘనపూర్‌లో డబుల్ బెడ్ రూం […]
సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా యాదగిరిపల్లి శివారులో ఏర్పాటుచేస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ లోని ఒక భవనం వద్ద స్లాబ్ బుధవారం కూలింది. ఈ ప్రమాదంలో కూలీలు అప్పన్న (శ్రీకాకుళం), చెన్నయ్య (మహబూబ్‌నగర్), వెంకటస్వామి (మహబూబ్‌నగర్), రాములు(తాండూర్) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విల్లా-6 స్లాబ్ నిర్మాణం చేస్తుండగా నాణ్యత లోపించి స్లాబ్ సుమారు 20అడుగు లోతు మేర కూలింది.
న్యూఢిల్లీ: దేశానికి రాజు అయినా..తల్లికి కొడుకే అనే సామేత అందరికీ తెలిసిందే. అయితే ఎంత ఎత్తుకుఎదిగినా కుటుంబం వరకు వచ్చేసరికి తనకున్న బాధ్యతలను నిర్వహించాల్సిందే. అందుకే ప్రపంచ క్రికెట్‌ను ఏలిన సచిన్ టెండూల్కర్ కూడా తన పిల్లల విషయంలో ఓ తండ్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.లాక్ డౌన్‌తో బార్బర్ షాప్స్ మూతపడడంతో తానే స్వయంగా కత్తెర పట్టాడు. కుమారుడు అర్జున్ కోసం హెయిర్ స్టయిలిస్ట్ గా మారిపోయాడు. కటింగ్ చేస్తూ తనకు నచ్చిన రీతిలో కొడుకు హెయిర్ స్టైల్ […]
అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ సారథి న్యూస్, రామాయంపేట: వానాకాలం సీజన్ లో రైతులు మక్క పంటను సాగు చెయొద్దని, సీఎం కేసీఆర్ చెప్పినట్లు నియంత్రిత పంటల విధానం పాటించాలని రామాయంపేట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ సూచించారు. బుధవారం మండలంలోని నస్కల్ గ్రామంలో రైతులకు నియంత్రిత పంటల విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు మక్క పంటను అసలు సాగుచేయొద్దని, వేసేవారికి రైతుబంధు స్కీం వర్తించదని చెప్పారు. సన్నరకం వరికి డిమాండ్ వస్తుందని, మంచి రేటుకు అమ్ముడు […]
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సారథి న్యూస్, గోదావరిఖని: గోదావరి దిశ మార్చి, తెలంగాణ దశ మార్చిన సీఎం కేసీఆర్ అపరభగీరథుడని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం గోలివాడ గ్రామంలో రూ.70లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగం కష్టాలను శాశ్వతంగా తొలగించాలనే సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో పథకాలను అమలుచేశారని కొనియాడారు. తెలంగాణ […]