సారథి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఆదివారం ఉదయం నాటికి పాజిటివ్ కేసులు 1097కు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వివరాలను వెల్లడించారు. బాధితులకు యుద్ధ ప్రాతిపదికన కరోనా పరీక్షలుు చేయడంతో పాజిటివ్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ప్రతిరోజు కేసులు పెరుగుతున్నాయి. దీంతో పరిస్థితులపై ఆందోళన కలుగుతోంది. లాక్ డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేయకపోతే పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఎప్పటికైనా […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా విపత్తు కింద తెల్లరేషన్ కార్డుదారులకు ప్రకటించిన రూ.1500 ఆర్థిక సాయం పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి రేషన్ బియ్యం తీసుకోని వారికి రూ.1500 నగదు సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 8.26 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు కరోనా నగదు సాయానికి దూరం కానున్నారు. తొలుత రాష్ట్రంలోని మొత్తం 87.54 లక్షల మంది తెల్ల […]
సారథి న్యూస్, తలకొండపల్లి: రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న వరిధాన్యం పారా బాయిల్డ్ మిల్లులుకే పరిమితం కాకుండా అన్ని మిల్లులకు అప్పగించాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కు నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్ ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట కల్వకుర్తి వైస్ ఎంపీపీ కొండూరు గోవర్ధన్ తదితరులు ఉన్నారు.
పన్నెండో శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన బసవేశ్వరుడు విశ్వగురువుగా పేరొందారు. కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని బాగేవారి వీరి జన్మస్థలం. బసవేశ్వరుడు 1134 లో వైశాఖ శుద్ధ తదియ రోజున(అక్షయ తృతీయ) అనగా సరిగ్గా 880 ఏళ్లం క్రితం జన్మించారు. తల్లి మాదాంబ, తండ్రి మాదిరాజు ద్వారా చిన్న వయసులోనే బసవేశ్వరుడు శైవపురాణ గాథలను అవగతం చేసుకున్నారు. కుల, వర్ణ, లింగ వివక్షలు లేని సమసమాజ స్థాపనకు ఆనాడే అపారమైన కృషిచేసిన సంఘసంస్కర్త. సనాతన సంప్రదాయ ఆచరణలో నెలకొన్న […]
సారథి న్యూస్, చొప్పదండి: పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయక నిధి కింద రూ.3,20,500 మొత్తాన్ని చెక్కుల రూపంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని వారికి ఇది వరం లాంటిదన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, ఎంపీపీ చిలుక రవిందర్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సంబన్న ,టీఆర్ ఎస్ […]
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం మహాన్యాస పూజలు నిర్వహించారు. అక్షయ తృతీయ సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేక సహిత అష్టోత్తర శత(108) కలశాలతో అభిషేకం నిర్వహించారు. గంటంబొట్ల రాజేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఉమాశంకర్ శర్మ, మురళిశర్మ, రవిప్రసాద్ శర్మ , సుహాస్, వృశిష్ పాల్గొన్నారు.
ఇది అన్నమయ్య కీర్తనలోని.. పదం దీన్ని మనం మాట్లాడే మన భాషకు వర్తింపజేస్తూ ముచ్చటిద్దాం. తేట తెలుగు.. మాట అటుంచితే వాటమైన తెలుగు కోసమే ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ప్రతిమాటకు అంటే ఏమిటి అని ఇంట్లోని కొత్త తరం పిల్లలు ప్రశ్నిస్తుంటే గుండెలో కెళుక్కుమంటోంది. భాషకు పట్టం కట్టాల్సిన తెలుగు లోగిళ్లు అది జీర్ణావస్థకు చేరుతున్నా ప్రమాదం మనకు కాదు అనుకుంటున్నారు. మన జాతి మనుగడకే ముప్పు వస్తుందని గుర్తించడం లేదు. అదో వృథా ప్రయాసలా భావిస్తున్నారు. […]