Breaking News

Day: April 23, 2020

అరుణకు అండగా ఎస్సీ, ఎస్టీ కమిషన్

అరుణకు అండగా ఎస్సీ, ఎస్టీ కమిషన్

సారథి న్యూస్, రంగారెడ్డి : ప్రేమ పేరుతో మోసపోయిన బాధితురాలు అరుణకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని కమిషన్ సభ్యుడు చిలకమర్రి నరసింహ హామీనిచ్చారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్​ఘాట్ గ్రామానికి చెందిన దళిత కులానికి చెందిన అరుణ, అదే గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ ప్రేమించి పెళ్లి చేసుకుని మోసగించాడు. అరుణ న్యాయ పోరాటానికి దిగింది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు  నరసింహ స్పందించి […]

Read More
రెడ్​జోన్లలో కార్యకలాపాలు వద్దు

రెడ్​జోన్లలో కార్యకలాపాలు వద్దు

సారథి న్యూస్, శ్రీకాకుళం: రెడ్ జోన్లలో ఎలాంటి  కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని స్పష్టం చేశారు. సాయంత్రం జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంటైన్​ మెంట్​ జోన్లలో డోర్ డెలివరీ సౌకర్యం పెంచాలని సూచించారు. కరోనా నియంత్రణలోజిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు చాలా శ్రమిస్తున్నారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్​ కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లో ప్రసూతి, […]

Read More
నిత్యావసర సరుకులు పంపిణీ

నిత్యావసర సరుకులు పంపిణీ

సారథి న్యూస్, నర్సాపూర్: నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్​లో టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ బీహార్ కార్మికులు, గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పంచాయతీ కార్మికులకు కూరగాయలు, బియ్యం, శానిటైజరులు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సోమని మాణిక్య గౌడ్, శేఖర్ గౌడ్, భూమగౌడ్ పాల్గొన్నారు.

Read More
రక్తదానం గొప్ప కార్యం

రక్తదానం గొప్ప కార్యం

సారథి న్యూస్, నర్సాపూర్: రక్తదానం ప్రాణదానంతో సమానమని మెదక్​ డీఎంహెచ్​వో డాక్టర్​ వెంకటేశ్వర్లు అన్నారు. కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామానికి చెందిన 13 మంది యువకులు కౌడిపల్లి పీహెచ్​లో గురువారం రక్తదానం చేశారు. యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. చాలా మంది గర్భిణులు రక్తం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ వో విజయనిర్మల, పీహెచ్​సీ డాక్టర్ వెంకటస్వామి, శోభన, సర్పంచ్​లు వెంకటేశ్వర్ రెడ్డి, శోభ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Read More
రైతులకు అండగా ప్రభుత్వం

రైతులకు అండగా ప్రభుత్వం

సారథి న్యూస్, దుబ్బాక: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఈనెల 19న దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చేల్లాపూర్ వార్డులో రైతు మట్ట బుచ్చిరెడ్డి(36) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. బాధిత కుటుంబానికి గురువారం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.ఆరులక్షల చెక్కును అందజేశారు.

Read More
కార్మికులకు అండగా ఉంటాం

కార్మికులకు అండగా ఉంటాం

సారథి న్యూస్ ,దుబ్బాక: దుబ్బాక పట్టణంలో గురువారం చేనేత కార్మికుల కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధిని అరికట్టడంలో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బాలేష్ గౌడ్, రాజిరెడ్డి, రోశయ్య, సుభాష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, సాయి కుమార్ గౌడ్, భాను పాల్గొన్నారు.

Read More
నడిగడ్డలో కరోనా కలకలం

నడిగడ్డలో కరోనా కలకలం

సారథి న్యూస్​, జోగుళాంబ గద్వాల: నడిగడ్డకు కరోనా కునుకు లేకుండా చేస్తోంది. మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. గురువారం వరకు జోగుళాంబ గద్వాల జిల్లాలో 42 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం ఒక్కరోజే 10 పాజిటివ్​ కేసులు నమోదుకావడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోనే ఏడు కేసులు నమోదయ్యాయి. ఆలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ముగోనిపల్లి గ్రామంలో ముగ్గురు, గద్వాల టౌన్ లో ఏడుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

Read More
బదిలీల ప్రభావం చూపేనా?

బదిలీల ప్రభావం చూపేనా?

సూర్యాపేటలో ముగ్గురు అధికారుల బదిలీ లాక్‌డౌన్‌ అమలు చేయకపోవడంతోనే డీఎస్పీ, సీఐపై వేటు డీఎంహెచ్‌వో సొంత పోస్టుకు బదలాయింపు సారథి న్యూస్, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు అధికారుల బదిలీ అంశం చర్చనీయాంశమైంది. లాక్‌ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయకపోవడం.. కరోనా వైరస్‌ విజృంభణను అరికట్టడంలో విఫలమయ్యారనే కారణంతో ఇద్దరు పోలీస్‌ అధికారులు, ఒక వైద్యాధికారిపై బదిలీ వేటువేసింది. గనెలలో సూర్యాపేట శివారు కుడకుడకు చెందిన ఓ వ్యక్తి మర్కజ్‌ వెళ్లొచ్చాడు. అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో […]

Read More