Breaking News

హైదరాబాద్​లో పరువు హత్య

హైదరాబాద్​లో పరువు హత్య


సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​లో పరువు హత్య తీవ్ర సంచలనంగా మారింది. కూతురు వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుందని తండ్రి సదరు యువకుడిని దారుణంగా హత్యచేయించాడు. సుఫారి గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడ్డట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు.. సంగారెడ్డికి చెందిన లక్ష్మారెడ్డి కుటుంబం చందానగర్​లో నివాసం ఉంటోంది. లక్ష్మారెడ్డి కూతురు అవంతి, అదే ప్రాంతానికి చెందిన హేమంత్ ప్రేమించుకున్నారు. ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో గత జూన్10న ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిచేసుకున్నారు. అనంతరం హేమంత్​, అవంతి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు.

అయితే గురువారం అవంతి, హేమంత్​ వద్దకు అవంతి బంధువులు వచ్చారు. అవంతి అక్కలు, బావలు, వదినలు వచ్చారు. అయితే ఇంటికి వెళ్థామంటూ ఈ జంటను బంధువులు తమ కార్లలో తీసుకెళ్లారు. అయితే కారు ఎక్కాక బంధువుల ప్రవర్తన చూసి హేమంత్​కు అనుమానం వచ్చింది. అనంతరం వారు కారులో హేమంత్​ను చితకబాదారు. కొంతదూరం వెళ్లాక అవంతిక, హేమంత్​ కారునుంచి బలవంతంగా దిగారు. పారిపోయేందుకు యత్నించారు. అయితే అవంతికి తప్పించుకోగా.. హేమంత్​ మాత్రం బంధువులకు దొరికాడు. దీంతో అతడిని వారు తీసుకెళ్లారు. అయితే అవంతిక, హేమంత్​ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముళ్లపొదల్లో హేమంత్​ డెడ్​బాడీ

శుక్రవారం సంగారెడ్డిలో హేమంత్​ మృతదేహం లభ్యమైంది. హేమంత్​ను ఉరివేసి చంపినట్టు సమాచారం. ఈ హత్యలో అవంతి మేనమామ కూడా పాలుపంచుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అవంతి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అవంతిక మేనమామ యుగంధర్​రెడ్డి ఈ హత్యలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు హేమంత్​ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా దవాఖానకు పోస్ట్​మార్టం కోసం తరలించారు. పోస్ట్​మార్టం తర్వాత పూర్తివివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.