సారథి న్యూస్, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖను బలోపేతం చేసేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు నియమించిన కేబినెట్ సబ్ కమిటీ గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమైంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి కె.తారక రామరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఆరునెలలుగా వైద్యారోగ్యశాఖ చాలా బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్నారని కొనియాడారు. మహమ్మారి కట్టడికి కృచేసిన వైద్యులు, డాక్టర్లు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేసిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సీజనల్ వ్యాధుల శాతం తగ్గిందన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో పనిచేయడం ద్వారా కరోనాను కట్టడి చేయగలిగామని అన్నారు.
- October 8, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- ERRABELLI
- HYDERABAD
- KTR
- MUNCIPAL DEPARTMENT
- TELANGANA
- ఎర్రబెల్లి
- కేటీఆర్
- తెలంగాణ
- మున్సిపల్‌శాఖ
- సీఎం కేసీఆర్
- హైదరాబాద్
- Comments Off on వైద్యారోగ్యశాఖ పనితీరు భేష్