సారథిన్యూస్, విశాఖపట్నం: ‘మేము మూడు రాజధానులకు ఒప్పుకోం.. అమరావతే ఆంధ్రుల రాజధాని’ అని మంకుపట్టు పట్టిన టీడీపీకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. ఇప్పటికే విశాఖకు చెందిన పలువురు నేతలు టీడీపీని వీడి వైఎస్సాఆర్ కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారని సమాచారం. గణేశ్‌తో పాటు మరో ఎమ్మెల్యే కూడా చంద్రబాబుకు వీడ్కోలు చెప్పనున్నారట. గణేశ్.. కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆదివారం ఆయన సీఎం జగన్మోహన్రెడ్డితో భేటీ కానున్నారని టాక్. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి చంద్రబాబుపార్టీని వీడారు. వారంతా వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం గణేశ్ కూడా వారి బాటలోనే పయనించనున్నారట. వరుసగా నేతలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో చంద్రబాబు తీవ్ర నైరాశ్యం చెందుతున్నారట. చంద్రబాబు వృద్ధుడైపోవడం.. లోకేశ్ రాజకీయాల్లో రాణిస్తాడన్న నమ్మకం లేకపోవడంతో నేతలంతా టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారని సమాచారం.
- September 19, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- ANDHRAPRADESH
- APCM JAGAN
- CHANDRABABU
- HYDERABAD
- LOKESH
- MLA
- TDP
- VISHAKAPATNAM
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ సీఎం జగన్
- చంద్రబాబు
- విశాఖపట్నం
- హైదరాబాద్
- Comments Off on విశాఖలో టీడీపీకి మరో షాక్!