Breaking News

నేపాల్​ ముఠా అరెస్ట్​.. ఎలా దొరికారంటే

కొంతకాలంగా హైదరాబాద్​తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు చేస్తున్న ముఠా సైబారాబాద్​ పోలీసులకు చిక్కింది. ఉత్తరప్రదేశ్ సరిహద్దులో వీరిని అరెస్ట్​ చేసినట్టు సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. నిందితుల నుంచి రూ.5లక్షల నగదు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్టోబర్ 6న ఈ ముఠా హైదరాబాద్ రాయదుర్గంలో ఈ ముఠా దొంగతనానికి పాల్పడింది. మధుసూదన్​రెడ్డి అనే కాంట్రాక్టర్​ ఇంట్లో పనిమనుషులుగా చేరిన ముఠా సభ్యులు వారి కుటుంబానికి భోజనంలో మత్తు మందు ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత అలర్ట్​ అయిన పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలించారు. 10 టీమ్​లు నేపాల్​ గ్యాంగ్​ కోసం గాలించాయి. చివరకు యూపీ సరిహద్దులో.. ముఠా సభ్యులు వినోద్ సాహి, నార్జింగ్ సాహి, సీతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.