పాకిస్థాన్‌లో మైనార్టీలకు రక్షణ కరువైంది. హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు జరగడం అక్కడ పరిపాటిగా మారింది. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని బదిన్ సింద్ పాకిస్థాన్ ప్రాంతంలో ‘శ్రీ రామ్ మందిర్’ను గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం చేశారు. ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలను విధ్వంసం చేయడం పాకిస్థాన్‌లో పరిపాటిగా మారింది. బదిన్ ప్రావిన్స్‌లోని కరియో ఘన్వర్ ప్రాంతంలో ఈ మందిరం వుండేది. అక్టోబర్ 10వ తేదీ రాత్రి కొందరు దుండగులు ఈ మందిరాన్ని కూల్చి వేశారు. శ్రీరామ్ మందిర్ కూల్చివేతను పాకిస్తాన్లో మైనారిటీల హక్కుల కోసం పోరాడుతున్న అనిలా గుల్జార్ ఫేస్బుక్ వేదికగా ధృవీకరించారు. పాకిస్తాన్ వ్యాప్తంగా మొత్తం 428 హిందూ దేవాలయాలుండగా.. వాటి సంఖ్య ఇపుడు 20కి పడిపోయిందని, దేవాలయాల విధ్వంసం కొనసాగుతూనే వుందని ఆమె పేర్కొన్నారు. దేవాలయాను కూల్చివేస్తుంటే పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.
- October 11, 2020
- Archive
- Top News
- జాతీయం
- ANDHRAPRADESH
- HYDERABAD
- INDIA
- PAKISTHAN
- POLICE
- TELANGANA
- TEMPLE
- టెంపుల్
- తెలంగాణ
- పాకిస్థాన్
- హైదరాబాద్
- Comments Off on శ్రీరామ్మందిరం కూల్చివేత.. పాకిస్థాన్‌లో దారుణం