కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో తీవ్ర అలజడి చెలరేగింది. కర్నూల్ జిల్లా నంద్యాలలో వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణహత్యకు గురయ్యారు. ప్రస్తుతం నంద్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సుబ్బారాయుడిపై గుర్తు తెలియని దుండగులు కర్రలతో వచక్షణారహితంగా దాడి చేశారు. నంద్యాలలోని విజయ పాల డెయిరీ సమీపంలో ఈ హత్య జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నది. పాతకక్షలతోనే ఈ దాడి జరిగిందా? లేక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియరాలేదు. సుబ్బారాయుడు పొన్నాపురం రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నారు. న్యాయవాదిగానూ ప్రాక్టీస్ చేస్తున్నారు. సుబ్బారాయుడు హత్యను వెఎస్సార్కాంగ్రెస్ ఖండించింది. పోలీసులు నిందుతులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నది.
- October 9, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- క్రైమ్
- ANDHRAPRADESH
- CMJAGAN
- MURDER
- TDP
- YSRCP
- ఆంధ్రప్రదేశ్
- వైఎస్సార్సీపీ
- సీఎంజగన్
- Comments Off on వైసీపీ నేత దారుణహత్య.. నంద్యాలలో టెన్షన్.. టెన్షన్