కొందరు స్త్రీల ప్రవర్తనతో సభ్య సమాజమే తలదించుకుంటున్నది. తాజాగా ఓ యువతి వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది. రాయదుర్గానికి చెందిన రవి అనే వ్యక్తి భార్య స్థానికంగా బ్యూటీ పార్లర్ నడుపుతున్నది. అయితే ఆమె అదే ప్రాంతానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వంశీకృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. భార్య ప్రవర్తనతో రవికి ఎప్పటి నుంచో అనుమానం ఉంది.
భార్యను ఎలాగైనా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని రవి ప్లాన్ వేశాడు. అందుకోసం రాయదుర్గం పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సహాయం తీసుకున్నాడు. శనివారం ఎప్పటిలాగే బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన భార్య ఏఆర్ కానిస్టేబుల్ వంశీకృష్ణతో కలిసి హోటల్‌కు వెళ్లింది. దీంతో రవి కానిస్టేబుల్‌తో కలిసి హోటల్‌కు వెళ్లి వాళ్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.