Breaking News

కట్నం తేస్తేనే కాపురానికి రా..

సారథి న్యూస్​, శ్రీకాకుళం: న్యాయం చేయాలంటూ ఓ యువతి శ్రీకాకుళం మహిళా పోలీసులను ఆశ్రయించింది. కట్నం తీసుకొస్తేనే కాపురానికి రావాలంటూ భర్త, అత్తమామ.. ఇంటి నుంచి గెంటేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన శిరీష , తన సమీప బంధువైన చంద్రశేఖర్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. చంద్రశేఖర్​ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో కట్నం తేవాలని వారు ఒత్తిడి తెస్తున్నారని శిరీష ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరితే అత్తమామలు తనపై దాడి కూడా చేసారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను గర్భవతినని కూడా చూడకుండా కాపురం చేసేందుకు నిరాకరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.