Breaking News

అందరికీ అండగా ఉంటాం

అందరికీ అండగా ఉంటాం

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: పటాన్ చెరువు మండలం ముత్తంగి బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. గురుకుల పాఠశాలలో నిన్న కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. పాఠశాలలోని ఉపాధ్యాయురాలు పాటు 43 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు,  పాఠశాల సిబ్బందితో మాట్లాడారు.  భయం భయం వద్దని, అందరికీ అండగా జిల్లా యంత్రాంగం ఉంటుందన్నారు. కరోనా పాజిటివ్ వచ్చి వైద్యం పొందుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయురాలు ఆరోగ్య పరిస్థితిని వారికి ఫోన్ చేసి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని,  ఎలాంటి భయాలు, ఆందోళనకు గురికావద్దని అదనపు కలెక్టర్ రాజర్షి షా భరోసానిచ్చారు. అనంతరం, పటాన్ చెరువు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించారు. గురుకులం  తిరిగి పరిశీలించి, తరగతి గదిలో విద్యార్థులకు బోధిస్తున్న తీరును, భౌతిక దూరం, మాస్కులు ధరించడం తదితర అంశాలను గమనించారు.  ఈ కార్యక్రమంలో  వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి గాయత్రీ దేవి తదితరులు పాల్గొన్నారు.