సామాజిక సారథి, ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతకాని జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం సృష్టించింది. బుధవారం పాఠశాలలోని 100మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేయగా ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పదోతరగతిలో ఇద్దరికి, 6,8,9 తరగతులకు చెందిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణయిందని వైద్య సిబ్బంది తెలిపారు.