Breaking News

హనుమాన్ ఆలయం

ఆంజనేయుడి ఆలయానికి నెల జీతం విరాళం

ఆంజనేయుడి ఆలయానికి నెల జీతం విరాళం

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో అభయ ఆంజనేయుడి ఆలయం నిర్మాణానికి తనవంతుగా గురువారం గ్రామ సేవకుడు తవిటి నిరంజన్ తన ఒకనెల వేతనం రూ.10,116 విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్​ రావుకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నీరటి రాములు, గ్రామస్తులు భూపతిరావు, కావటి రామచంద్రం, దశరథం, సత్యనారాయణ, వెంకట్ నారాయణ, రామచంద్రయ్య, హనుమంతు, జంగయ్య, అశోక్ యాదవ్, కర్ణాకర్​రావు, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Read More