సారథి, చొప్పదండి: చొప్పదండి మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ.5,41,500 సీఎం సహాయ నిధి చెక్కులను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని కొనియాడారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం […]
సారథి, చొప్పదండి: చొప్పదండి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బంధారపు అజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్‌లో ఆఫీసులో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరై కేక్ కట్ చేశారు. వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సీఎం కేసీఆర్ కుడి భుజం మాదిరిగా పనిచేశారని, ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ ఆయన ఆలోచన విధానం కీలకమని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ […]
సారథి ప్రతినిధి, జగిత్యాల: రెండవ విడత గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ రూ.6వేల కోట్లు కేటాయించినందుకు జగిత్యాల జిల్లా కురుమ సంఘ నాయకులు ఎమ్మెల్యే క్వార్టర్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, పట్టణాధ్యక్షుడు పుల్ల గంగారాం, ప్రధాన కార్యదర్శి పుల్ల మహేష్, చెట్టె రమేష్, సాయిల్ల మురళి, బండారి మల్లేశ్, […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో టీఆర్ఎస్వీ నాయకుడు నరేష్ రావన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నరేష్ రావణ్ మాట్లాడుతూ.. దళితులను ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ప్రవేశపెడుతున్న తెలంగాణ దళితబంధు పథకం ద్వారా తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని సంతోషం వ్యక్తంచేశారు. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటామని ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్నీరజాభూంరెడ్డి, 9వార్డు కౌన్సిలర్ కొత్తూరి మహేష్, 10వ వార్డు కౌన్సిలర్ […]
సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సమక్షంలో తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రమణతో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఎల్.రమణ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే.
ఆగస్టు నుంచి బియ్యం పంపిణీ సీఎం కేసీఆర్ వెల్లడి సారథి, హైదరాబాద్: ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హులైన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. జులై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ ప్రక్రియను నిర్వహించాలని […]
సారథి, చొప్పదండి: అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చొప్పదండి తహసీల్దార్ ఆఫీసు ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు రూ.8,02,500 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న […]