సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు యేమ దుర్గపతి ఆధ్వర్యంలో గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను చూసి ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు చేయించుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు ఎల్లబోయిన బాబు, నల్ల యాదగిరి, నల్ల కృష్ణ, ముండ్రాతి ఆంజనేయులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పట్లొరీ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ సభ్యత్వ నమోదు చేయించారు. మండలంలోని అంబాజీపేట, చందాపూర్ గ్రామాల్లో సభ్యత్వాలు చేయించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్లు సాన సాయిలు, పడాల రమాదేవి, శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ధ్యాప బాలకిషన్, మ్యాసగల్ల పెంటయ్య, గోపాల్ నాయక్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, […]