సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. కార్తీక మాసం చివరి శనివారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ అమ్మవారికి సుప్రభాతసేవ, అభిషేకం, ఆరాధన నైవేద్యం, ఇతర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఆలయ ప్రధానార్చకుడు రామానుజాచార్యులు తెలిపారు. పక్కనే ఉన్న శివాలయంలో పరమశివుడికి ఏకరుద్రాభిషేకాలు, దీపారాధన నిర్వహించినట్లు వెల్లడించారు. అనంతరం స్వామివారి […]
సారథి న్యూస్, నాగర్కర్నూల్: జిల్లావ్యాప్తంగా సోమవారం కార్తీకమాస పౌర్ణమి సందర్భంగా భక్తులు పలు ఆలయాల్లో విశేషపూజలు జరిపించారు. వత్రాలు, నోములు ఆచరించారు. దీపారాధన, దీపదానం, ఆకాశ దిపోత్సవం, అర్చనలు, అభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామాలయంలోశ్రీ రామసహిత వెంకట సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. జిల్లా కేంద్రంలోని సీతారామస్వామి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ప్రాత:కాలంలోనే పరమశివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, ఆలయంలో దీపారాధనను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన […]