సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి ధాటికి బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. మంగళవారంర 10 గ్రామాల బంగారం రూ.50,670కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో పుంజుకున్న ధరలు, దేశీయస్టాక్ మార్కెట్లలో అమ్మకాలు, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనం నేపథ్యంలో పసిడికి డిమాండ్ పెరిగింది. కేజీ వెండి రూ.48,510 పలుకుతోంది. గ్రాము వెండి రూ.485.10 ఉంగా, 10 గ్రాముల వెండికి రూ.4,851 ఉంది.
సారథి న్యూస్, హైదరాబాద్: గోల్డ్రేటు పైపైకి పెరుగుతోంది.. సామాన్యులకు అందుకుండా దూసుకెళ్తోంది.. బుధవారం 10 గ్రాముల ధర రూ.48,420 వద్ద కొత్త గరిష్ట ధరను నమోదు చేసింది. 22 క్యారెట్ల బంగారం ఢిల్లీలో 10 గ్రాములకు రూ.46,800 కాగా, 24 క్యారెట్ల రిటైల్ ధర రూ.48వేలు పలుకుతోంది. అయితే వెండి ధర స్వల్పంగా తగ్గి కిలో ధర రూ.48,716 వద్ద ఆగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతమవుతుండడంతో పాటు ఆర్థిక పునరుద్ధరణ చాలా కాలం పట్టవచ్చని ఊహాగానాల […]