సారథి, కోడేరు: నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలోని నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శంకర్ నాయక్ తెలిపారు. మండలంలోని కోడేరు, తీగలపల్లి, జనంపల్లి, బావాయ్ పల్లి, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, పసుపుల గ్రామాల అభ్యర్థులు తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని బుధవారం ఎంపీడీవో ఆఫీసుకు 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. అలాగే రేమద్దుల, సింగోటం, కల్వకోలు బ్యాంకు ఖాతాదారులు 24వ తారీఖున హాజరుకావాలని ఆయన సూచించారు.
ఢిల్లీ: వివిధ రకాల రుణాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మారటోరియాన్ని మరో రెండేండ్ల పాటు పొడగించాలని కేంద్రం యోచిస్తోంది. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీపై చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ అంశంపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. మరో రెండేండ్లపాటు మారటోరియం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. అయితే మారటోరియం సమయంలో వడ్డీని మాత్రం […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు కోవిడ్-19 అత్యవసర తత్కాల్ రుణ సహాయం అందించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు ఆయా బ్యాంకుల మేనేజర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లోని రెవెన్యూ సమావేశ మందిరంలో బ్యాంకుల మేనేజర్లు, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా మారిందని, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇబ్బంది పడకుండా నేరుగా […]