సామాజిక సారథి, మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్పేట్ కార్పొరేషన్ లెనిన్ నగర్ లో జరిగిన సత్యనారాయణస్వామి వ్రతపూజా కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జ్అందెల శ్రీరాములు పాల్గొన్నారు. మీర్పేట్కార్పొరేటర్ మోడల బాలకృష్ణ కుటుంబసభ్యులు నిర్వహించిన పూజలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందెలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.