Breaking News

మానవపాడు

నేనున్నాను.. దిగులు వద్దు

నేనున్నాను.. దిగులు వద్దు

ఎమ్మెల్యే అబ్రహం భరోసా కల్లుతాగి మృతిచెందిన కుటుంబాలకు పరామర్శ సారథి, మానవపాడు: కల్తీ కల్లు తాగి చనిపోయిన మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం ఆదివారం మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చేరుకుని పరామర్శించారు. నాయక వెంకటరాముడు కుటుంబానికి రైతుబీమా పథకం ద్వారా రూ.ఐదు లక్షలు ప్రభుత్వం నుంచి త్వరగా వచ్చే విధంగా చేయాలని వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. వెంకన్నకు టీఆర్ఎస్ పార్టీ సాధారణ సభ్యత్వం ఉందని, పార్టీ నుంచి సహకారం […]

Read More
రక్తదానం గొప్పకార్యం

రక్తదానం గొప్పకార్యం

పారిశ్రామికవేత్త కిషోర్ కుమార్ సారథి, మానవపాడు: ప్రముఖ పారిశ్రామిక వేత్త జల్లాపురం కిషోర్ కుమార్ జన్మదిన సందర్భంగా యువసైన్యం ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో యువకులు వచ్చి రక్తదానం చేశారు. కిషోర్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై యువకులతో మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో నిరుపేద కుటుంబాలకు బ్లడ్ ఉచితంగా లభిస్తుందన్నారు. జిల్లాలో రక్తదాన శిబిరాలకు తన సహకారం ఉంటుందన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు […]

Read More
నేడే రంజాన్ పండగ

నేడే రంజాన్ పండగ

సారథి, మానవపాడు: కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించాలని, అందరూ సుఖశాంతులతో జీవనం కొనసాగించాలని ముస్లింలు గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జామియా మసీదు ముతవల్లి మహబూబ్ పాషా కోరారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే రంజాన్ చేసుకోవాలని కోరారు.

Read More
మేమున్నాం..

మేమున్నాం..

సారథి, మానవపాడు: కలిసి పెరిగారు.. కలిసి చదువుకున్నారు. ఒకరికొకరు కలిసి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామనికి చెందిన ఎండీ ఖాజాహుస్సేన్ నెలన్నర రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పదో తరగతి పూర్వవిద్యార్థులు (1998-99) రూ.63,500 ఆర్థికసాయం చేశారు. బొంకూర్ గ్రామానికి వెళ్లి మృతుడు ఎండీ ఖాజాహుస్సేన్ సతీమణి సైనాజ్ బేగం కుటుంబసభ్యులకు అందజేశారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు […]

Read More
బాలయోగి ఇక లేరు

బాలయోగి ఇక లేరు

సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురంలో బాలయోగి శివనారాయణస్వామి కన్నుమూశారు. స్వామివారు 76 ఏళ్లుగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. శివనారాయణ స్వామి ఇక లేరనే వార్తను భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. శివనారాయణ స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు విశేషసంఖ్యలో తరలివచ్చేవారు. స్వామివారు లేక లేరని భక్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read More
కరోనా టీకా తప్పనిసరి వేయించుకోవాలి

కరోనా టీకా తప్పనిసరి వేయించుకోవాలి

సారథి, మానవపాడు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపధ్యంలో ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవడంతో పాటు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని డాక్టర్ సవిత సూచించారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సిన్ నేషన్ నిర్వహించారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కరోనా నివారణ టీకాను వేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్ పై అపోహలు వద్దని ఆమె సూచించారు. ఏదైనా అత్యవసర పనిమీద బయటకొచ్చి ఇంటికి వెళ్లి తప్పనిసరిగా కాళ్లు, చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కోవాలని […]

Read More
ఎమ్మెల్యే అబ్రహంకు వైద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి

ఎమ్మెల్యే అబ్రహంకు వైద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి

సారథి, వడ్డేపల్లి(మానవపాడు): అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహంకు వైద్యారోగ్యశాఖ మంత్రి పదవి ఇస్తే తెలంగాణలో మాదిగ సామాజికవర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందని దళిత ప్రజాప్రతినిధుల మనవి వడ్డేపల్లి జడ్పీటీసీ సభ్యుడు కాశపోగు రాజు కోరారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అబ్రహం వృత్తి రీత్యా డాక్టర్ కావడంతో ఆరోగ్యశాఖను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో నియోజకవర్గంలో ఎవరికీ రాని మెజార్టీ డాక్టర్​అబ్రహంకు వచ్చిందని తెలిపారు. ప్రజాభిమానాన్ని చూరగొన్న నేతగా ఆయన వైద్యాశాఖ మంత్రి పదవికి […]

Read More
వెయ్యి కుటుంబాలకు సరుకులు పంపిణీ

వెయ్యి కుటుంబాలకు సరుకులు పంపిణీ

సారథి, మానవపాడు: యునైటెడ్ వే ఆఫ్ ఇండియా బొంబాయి సంస్థ వారు రాజోలి చేనేత శ్రామిక సేవాసమితి వారి ఆధ్వర్యంలో రాజోలి గ్రామంలో వెయ్యి చేనేత కార్మిక కుటుంబాలకు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా ఉండటంతో చేనేత మగ్గాలు నడవక చాలా కుటుంబాలకు తినడానికి కూడా తిండిలేక పస్తులు ఉంటున్నాయి. అలాంటి వారికి తమవంతుగా సాయం చేస్తున్నారు. చేనేత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కో ఆప్షన్ సభ్యుడు నిషాక్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. […]

Read More