సారథి న్యూస్,ములుగు: చెట్లే మానవజాతికి ప్రాణాధారమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆరోవిడుత హరితహారంలో భాగంగా శుక్రవారం ఆమె ములుగు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో మొక్కలు నాటారు. ములుగు మండలం జాకారం, బండారుపల్లి, వెంకటాపూర్ మండలంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. అటవీ సంపదను పెంచేందుకే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని తలపెట్టారని చెప్పారు. కార్యక్రమంలో ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎమ్మెల్యే […]
ఖమ్మం: టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 41, 43వ డివిజన్ మిర్చి మార్కెట్ రోడ్ లో రూ.కోటితో నిర్మించిన డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్ పనులను మేయర్ పాపాలాల్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
బెంగళూర్ : కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం సృష్టిస్తున్నది. సామాన్యులు, ప్రభుత్వాధికారులు, మంత్రులను వదలడం లేదు. తాజాగా కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ భార్య, ఆయన కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవలే సుధాకర్ తండ్రికి పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు చేశారు. తమ కుటుంబ సభ్యులకు నిర్వహించిన కోవిడ్-19 టెస్ట్ రిపోర్టులు వచ్చాయని, తన భార్య కుమార్తెకు పాజిటివ్ ఫలితాలు వచ్చాయని మంత్రి ట్వీట్ చేశారు. ప్రస్తుతం వారిద్దరూ ఆస్పత్రిలో […]
సారథి న్యూస్,హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి www.bse.telangana.gov.in వెబ్సైట్లో వివరాలు చూసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మెమోలు తమ పాఠశాలలో తీసుకోవాలని సూచించారు. పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్ఎస్సీ బోర్డుకు తెలియజేయాలన్నారు.
సారథి న్యూస్, నల్లగొండ: కనిపించని శత్రువైన కరోనాపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించడమే మార్గమన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఇతర ప్రజాప్రతినిధులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సూర్యాపేటకు మార్కెట్‌కు చేరడం మన దురదృష్టమన్నారు. అయినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ మహమ్మారి నియంత్రణపై పౌష్టికారం, ఇతర జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన […]