సారథిన్యూస్, గోదావరిఖని: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై 2,3,4 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు అన్ని సంఘాలు సన్నద్ధం కావాలని సింగరేణి జేఏసీ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ సమ్మె ద్వారా ప్రధాని మోదీకి కనువిప్పు కలిగించాలని కోరారు. సోమవారం గోదావరిఖనిలో జేఏసీ నాయకులు సమ్మెపోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేల్పుల కుమార్ స్వామి, నరేశ్, ఎంఏ గౌస్, శ్రీనివాస్, తోకల రమేశ్, ఉపేందర్ ఎండీ గని తదితరులు పాల్గొన్నారు.