సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి): బైండ్ల కులస్తుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేయాలని, తాను కులస్తుల విద్య, ఉపాధి, సమగ్ర అభివృద్ధికి నిరంతరం శ్రమించి పనిచేస్తానని తెలంగాణ బైండ్ల(భవనీయ)సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుల్ల గౌరీశంకర్ అన్నారు. తెలంగాణ బైండ్ల కులస్తుల రాష్ట్రస్థాయి సమావేశం హయత్ నగర్ లోని బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్ లో కడియం రామచంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ ఉపకులాల్లో అత్యధిక జనాభా కలిగిన బైండ్ల కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని […]