సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా మెురుమూరు గ్రామపంచాయతీలో శుక్రవారం వాజేడు వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించింది. అనంతరం ‘ప్రైడే డ్రైడే’ నిర్వహించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వరరావు, కోటిరెడ్డి, శ్రీనివాస్, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు, సెక్రటరీ నరేష్ పాల్గొన్నారు.