తెలుగులో ఇప్పుడు టాప్ హీరోయిన్ ఎవరంటే తడబడకుండా చెప్పే సమాధానం పూజా హేగ్డే.. ఈ ఏడాది ‘అలవైకుంఠపురములో’ చిత్రంతో పూజా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివ్రిక్రమ్ కంటే ఎక్కువ పేరు పూజాకే వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్‌తో రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నది. పీరియాడికల్ లవ్‌స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా మ్యూజిక్ టీచర్‌గా కనిపిస్తుందని టాక్. అంతేకాక ఈ సినమాలో పూజా డ్యూయెల్‌రోల్ చేస్తున్నదట. అందులో ఓ లుక్ […]
ఇప్పటికే వరుస హిట్లతో నంబర్‌వన్‌గా దూసుకుపోతున్న పూజాహేగ్డే మరో బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది. పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్ డైరెక్షన్లో చేయబోయే సినిమాలో పూజాకు హీరోయిన్గా చాన్స్ దక్కినట్టు సమాచారం. గతంలో పవన్‌కల్యాణ్.. హరీశ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఓ పవర్ఫుల్ కథను హరీశ్ వినిపించగా.. పవన్‌కల్యాణ్‌కు నచ్చిందట. ఇందులో పవర్‌స్టార్ యాంగ్రీ యంగ్‌మ్యాన్ పాత్రను పోషించనున్నట్టు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదు.
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ బాణీలు అందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభాకరన్ ఈ చిత్రం కోసం కొన్ని ట్యూన్స్ సిద్ధం చేసినట్టు టాక్. ప్రభాస్ 20వ చిత్రం ఇప్పటికే ప్రారంభమైనా దానికి సంబంధించిన ఎటువంటి వివరాలు బయటకు తెలియడం లేదు. దీంతో యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఒకింత నిరాశలో ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా విదేశాల్లో జరుగడం ఇందుకు కారణమని చిత్ర యూనిట్ చెబుతున్నది. […]