సారథి న్యూస్, మహబూబాబాద్: పల్లె ప్రగతి వనాలపై అవగాహన కల్పించాలని మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మహబూబాబాద్ రూరల్ మండలం వేమునూరు, శీతల్ గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వ భూములను పరిశీలించడంతో పాటు శ్మశానవాటిక పనులను పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్ కు నాటే మొక్కలు పెద్దవిగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మొక్కల సంరక్షణకు గ్రామంలో ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ఊరు వెలుపల నాటే మొక్కలకు సర్కారు తుమ్మ కంపను రక్షణగా ఏర్పాటు […]