హైదరాబాద్: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు కలిశారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించినందుకు వారిని ఆయన అభినందించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీలు పసునూరి దయాకర్, బడుగుల లింగయ్య యాదవ్, […]
సారథి న్యూస్, తాడ్వాయి: పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క కోరారు. శుక్రవారం మండలంలోని మేడారం వనదేవతల సన్నిధిలో ములుగు జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టభద్రులు కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి యువతకు దిశా నిర్దేశం చేయాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని, న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం మేడారంలోని ఇంగ్లిష్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి పట్టభద్రుడు ఓటరుగా తన పేరు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో టీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటరు నమోదు అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేలా […]