సారథి న్యూస్, నారాయణ ఖేడ్: ఉపాధి పనులు కల్పించాలంటూ కంగ్టి మండల కేంద్రంలో కూలీలు ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు. మండలంలోని పలు గ్రామాల్లో కొద్ది రోజులు మాత్రమే పనులు చేపట్టి ఆ తర్వాత నిలిపివేయడం సరికాదని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. గతంలో పనులకు సంబంధించిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఉపాధి కూలీలు, ప్రజలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, ఆదిలాబాద్ : సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక విధానాలపై శుక్రవారం రిమ్స్ ఆవరణలో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జాదవ్ రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పు, 12 గంటల పని దినాన్ని పెంచుతుందన్నారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్మికులందరికీ బోనస్ రూపంలో రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ […]