సారథి న్యూస్, మెదక్: కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడానికి రైస్ మిల్లర్లు అదనపు హమాలీలను సమకూర్చుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు. బుధవారం హవేలీ ఘనపురం మండల కేంద్రంతో పాటు రామాయంపేట మండలాల్లోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు తరలిస్తున్న ధాన్యం ఆయా మిల్లు వద్ద దిగుమతి కాకుండా అలాగే ఉంటునట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. […]
సారథి న్యూస్, నర్సాపూర్: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం మించిన వినియోగించుకోవాలని, దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 200 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈసారి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఏఈవో ఆధ్వర్యంలో ధాన్యం క్వాలిటీ చెక్ చేసి కొంటామన్నారు. కూపన్ల […]
సారథి న్యూస్, మెదక్: ధాన్యం కొనేందుకు కేంద్రం నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారని ఆరోపిస్తూ రైతులు బుధవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. మండలంలోని వెల్దుర్తి, ఆరెగూడెం గ్రామాల రైతులు తమ ధాన్యం విక్రయించేందుకు వెల్దుర్తి సహకార సొసైటీ కొనుగోలు కేంద్రానికి వచ్చారు. తాము పొలం వద్ద శుభ్రంచేసి ధాన్యాన్ని తీసుకొచ్చినా కూడా మళ్లీ కేంద్రం వద్ద మరోసారి శుద్ధిచేయమంటున్నారని ఆక్షేపించారు. 16శాతం తేమతో వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని తెచ్చినప్పటికీ ఇక్కడి అధికారులు […]
సారథి న్యూస్, నాగర్కర్నూల్: కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, సంబంధిత అధికారులు అలసత్వం, పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. బుధవారం ఆయన వనపర్తి కలెక్టరేట్ నుంచి మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు, అగ్రికల్చర్, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని తప్పనిసరిగా కొనాలని సూచించారు. […]