జైపూర్: సచిన్ పైలట్ దురాశ వల్లే రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. అతను మళ్లీ కాంగ్రెస్లోకి రావాలనుకుంటే తాను ఆహ్వానిస్తానని చెప్పారు. కాంగ్రెస్ జాతీయపార్టీ అని.. ఇక్కడ వేచి చూస్తే తగిన సమయంలో పదవి దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వైపు సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకుండా హైకోర్టు స్టే విధించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడలను ప్రారంభించిందని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.