న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివియర్స్ను ఆపడం కష్టమని భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. ఈ ఇద్దరికి బౌలింగ్ చేయడం కత్తిమీద సామేనని చెప్పాడు. ఈ ఇద్దరిలో తమకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయన్నాడు. ‘స్మిత్ ఎక్కువగా బ్యాక్ ఫుట్ ఆడతాడు. బంతిని కూడా చాలా ఆలస్యంగా ఎదుర్కొంటాడు. దీనివల్ల బంతిని ఏ వైపు టర్న్ చేయాలన్న దానిపై సందిగ్దం తలెత్తుంది. […]
జొహెన్సెస్బర్గ్: కరోనా దెబ్బకు ఆగిపోయిన క్రికెట్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు అన్ని దేశాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఇందులో దక్షిణాఫ్రికా కాస్త భిన్నంగా ఆటను ప్రారంభించబోతున్నది. 3టీ రూపంలో ఓ భిన్నమైన ఫార్మాట్‌ను అందుబాటులో తీసుకొస్తోంది. ఈనెల 27న 24 మంది ఆటగాళ్లు మూడు జట్లుగా విడిపోయి మ్యాచ్ ఆడనున్నారు. మూడు జట్లలో ఈగల్స్‌కు డివిలియర్స్, కింగ్ ఫిషర్స్‌కు రబడా, కైట్స్‌కు డికాక్ సారథ్యం వహించనున్నాడు. ప్రతి జట్టులో ఎనిమిది మంది ఆటగాళ్లు ఉంటారు. మొత్తం […]
న్యూఢిల్లీ: భారత జట్టుకు కోచ్‌గా ఎంపికవడానికి తనకు ఏడు నిమిషాల సమయం పట్టిందని దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ గ్యారీ కిర్‌స్టెన్ వెల్లడించాడు. తనకు ఆసక్తి లేకపోయినా.. కనీసం దరఖాస్తు చేయకపోయినా ఆ పదవి తనకు దక్కిందన్నాడు. దీనికంతటికి కారణం అప్పటి సెలెక్షన్ కమిటీ మెంబర్, దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ అని స్పష్టం చేశాడు. ‘2007లో గ్రెగ్ చాపెల్ వారసుడి కోసం బీసీసీఐ అన్వేషిస్తోంది. ఆ సమయంలోనే నాకు టీమిండియాకు కోచింగ్ ఇచ్చే ఆసక్తి ఉందా? సన్నీ […]
సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన ఆరోపణలు లండన్: వన్డే ఫార్మాట్ లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు సచిన్. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా 2010 గ్వాలియర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో మాస్టర్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. అయితే తాను 190 పరుగుల వద్ద సచిన్ ను ఎల్బీ చేసినా అంపైర్ ఔట్ ఇవ్వలేదని సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్ సంచలన ఆరోపణలు చేశాడు. అప్పుడు ఔటిస్తే ద్విశతకం కాకపోయేదని అక్కసు […]