సారథి న్యూస్, హైదరాబాద్: సీపీఐ(మావోయిస్ట్) పార్టీ తెలంగాణలో మళ్లీ పాగావేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రకమిటీతో పాటు ఏరియా కమిటీలను ప్రకటించి పోలీసులకు సవాల్ విసిరింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణను ఎన్నుకున్నట్లు సమాచారం. ఏడుగురు సభ్యులతో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. పుల్లూరి […]