సారథి న్యూస్, హైదరాబాద్: పెళ్లిళ్ల కోసం అనుమతులు ఇచ్చే బాధ్యతలను మండల తహసీల్దార్‌కు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీచేసింది. జూలై 21వ తేదీ నుంచి శ్రావణం మాసం మొదలుకానుండడంతో పెద్దఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అయితే తహసీల్దార్లు కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని, ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది పెళ్లికొడుకు, పెండ్లికూతురు తరఫున 20 మంది మాత్రమే హాజరయ్యేలా ఆదేశాలు ఇచ్చింది. పెండ్లి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడిన షేక్‌పేట తహసీల్దార్ సుజాత భర్త అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాంధీనగర్‌లో భవనంపైకి నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు.
సారథి న్యూస్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్ గురువారం సందర్శించి ఆస్పత్రి భవన స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరిందని తెలియడంతో స్థానిక తహసీల్దార్ సైదులుతో కలిసి ఆయన పరిశీలించారు. ఒకవేళ ఆస్పత్రిని మార్చితే స్థానిక అనుకూలమైన భవనాలను కలియ తిరిగి చూశారు.