సారథి న్యూస్, కంగ్టి, నారాయణఖేడ్: ‘అందరినీ సల్లంగా సూడు పోచమ్మ తల్లి’ అంటూ మహిళలు, ఆడపడుచులు అమ్మవారిని వేడుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో ఘనంగా బారడీ పోచమ్మ ఉత్సవాలు నిర్వహించారు. గ్రామశివారులో నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పెద్దసంఖ్యలో మహిళలు కలశాలు, బోనాలతో ఆలయానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాగణం మార్మోగింది. బోనాలు, ఎడ్ల బండ్లు […]
సారథి న్యూస్, కంగ్టి, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో నూతనంగా నిర్మించిన బారడీ పోచమ్మ ఆలయంలో సోమవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మధ్యాహ్నం విగ్రహాన్ని ప్రతిష్టించి నైవేద్యం పెట్టి, సాయంత్రం బోనాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎడ్ల బండ్లను ముస్తాబుచేసి ఊరేగింపుగా ఊరు శివారులో ఉన్న బారడీ పోచమ్మ మందిరం వరకు తీసుకెళ్లి ప్రదక్షిణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదానం ఉంటుందని, భక్తులు తరలొచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
సారథి న్యూస్, కంగ్టి: నీటి కుంటలో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో చోటు చేసుకుంది. కురుమ గాయత్రి(8) తల్లితో కలిసివెళ్లి శనివారం ఉదయం బట్టలు ఉతకడానికి గ్రామ శివారులోని నీటి కుంటలోకి దిగి బట్టలు ఉతుకుతున్న సమయంలో కాలు జారీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి చూడగానే శ్వాస ఆడక కొట్టుమిట్టాడుతున్న బిడ్డను చూసి సృహకోల్పోయింది. నీటిలో మునిగిన బిడ్డను బయటికి […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు వాగులు, వంకలు మత్తడి దూకుతున్నాయి. చాలా గ్రామాల్లో పత్తి, మినుము, సోయా, కంది పంటలు నీటిమునిగిపోయాయి. పంట పొలాల్లో నిలిచిన నీటిని మళ్లించేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామానికి చెందిన కొందరు రైతులు వ్యవసాయ పొలానికి వెళ్లేందుకు చందాలు వేసుకుని రూ.ఐదులక్షల వ్యయంతో ఫార్మేషన్ రోడ్డు నిర్మించుకున్నారు. సోమవారం కురిసిన జోరు వానకు బ్రిడ్జితో పాటు […]