Breaking News

కోడేరు

‘ప్రైవేట్​లో మందులు విక్రయిస్తున్న డాక్టర్​పై చర్యలు తీసుకోవాలి’

‘ప్రైవేట్​లో మందులు విక్రయిస్తున్న డాక్టర్​పై చర్యలు తీసుకోవాలి’

సారథి, కోడేరు(కొల్లాపూర్): నాగర్​కర్నూల్ ​జిల్లా కోడేరు ప్రభుత్వ పశువైద్య కేంద్రంలో మూగజీవులకు మందులను అందుబాటులో ఉంచకుండా ప్రైవేట్​ వ్యక్తులకు విక్రయిస్తున్న పశు వైద్యాధికారి డాక్టర్ భానుకిరణ్ పై చర్యలు తీసుకోవాలని యాదవ సంఘం మండల గౌరవాధ్యక్షుడు యాపట్ల శేఖర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మందులు సరఫరా చేస్తుండగా, ఆయన మాత్రం మందులు ఇవ్వకుండా నాగర్ కర్నూల్, సింగోటంలోని ప్రైవేట్​మెడికల్ షాపునకు చీటీలు రాస్తున్నారని పేర్కొన్నారు. రైతులు, గొర్రెల కాపరుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని మందులను సింగయిపల్లిలో నిల్వచేసి […]

Read More
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు

సారథి, కోడేరు: నాగర్​కర్నూల్​ జిల్లా కోడేరు మండలంలోని నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శంకర్ నాయక్ తెలిపారు. మండలంలోని కోడేరు, తీగలపల్లి, జనంపల్లి, బావాయ్ పల్లి, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, పసుపుల గ్రామాల అభ్యర్థులు తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని బుధవారం ఎంపీడీవో ఆఫీసుకు 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. అలాగే రేమద్దుల, సింగోటం, కల్వకోలు బ్యాంకు ఖాతాదారులు 24వ తారీఖున హాజరుకావాలని ఆయన సూచించారు.

Read More

పేదలబియ్యం పక్కదారి

సారథిన్యూస్​, కోడేరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని దారిమళ్లించి సొమ్ము చేసుకోవాలనుకున్న ఓ రేషన్​డీలర్​ భర్తను పోలీసులు అరెస్ట్​ చేశారు. కోడేరు మండల కేంద్రంలోని రేషన్​షాప్​నెంబర్​ 3 డీలర్​ శారద భర్త శ్రీనివాసులు 95 కిలోల బియ్యాన్ని దారి మళ్లించాడు. కోడేరు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై పౌరసరఫరాల సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశామని డీలర్ ను అదుపులోకి తీసుకున్నామని పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్ బాబు తెలిపారు.

Read More